Bandi Sanjay Sensational Comments: రజాకార్ల రాజ్యాన్ని పాతరేసి రామరాజ్యాన్ని స్థాపించేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ అంతటా హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తామని హిందుత్వం లేకుంటే దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఝనిస్తాన్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవని ఆయన అన్నారు. కర్ణాటకలో హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం కోల్పోవడం వల్ల పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేసే దుస్థితి నెలకొందన్నారు. ఆదివారం నాడు కరీంనగర్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు బండి సంజయ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ గడ్డ బండి సంజయ్ ది. హిందుగాళ్లు బొందుగాళ్లన్న వాళ్లను బొందపెట్టిన గడ్డ. హిందుత్వ అడ్డా ఇది, కరీంనగర్ వేదికగా హిందూ సమాజానికి సేవ చేసే అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. కరీంనగర్ గడ్డకు రుణపడి ఉంటా. హిందూ సమాజానికి హాని చేసే వాళ్ల కోసం జైలుకెళ్లానని, తెలంగాణ మొత్తం హిందుత్వ వాతావరణం తీసుకురావాలే. కుహానా లౌకిక వాదులు ఆటకట్టించడానికి ఈ ఏక్తా యాత్ర అని అన్నారు. మన ఐక్యతను చాటాలనే ఉద్దేశంతోనే సాగుతున్న యాత్ర ఇదని అన్నారు. కుహానా లౌకిక వాదులకు హిందూ సంఘటిత శక్తిని చాటేందుకే ఈ హిందూ ఏక్తా యాత్ర అని ఎవడైతే 15 నిమిషాలు టైమిస్తే మనల్ని చంపుతానని అన్నడో... అట్లాంటోళ్లను రోడ్లమీద ఉరికించడానికి ఇంకా 5 నెలలే ఉందని అన్నారు.


Also Read: Chatrapathi Remake: దారుణంగా హిందీ ఛత్రపతి కలెక్షన్స్.. బొక్కబోర్లా పడ్డారుగా!


కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే... పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు, ఇవాళ హిందూ ధర్మం కోసం ఆలోచించే పార్టీ లేకపోవడం వల్ల పాకిస్తాన్ జిందాబాద్ అనే దుస్థితి వచ్చిందని అన్నారు. ఈ దేశంలో హిందుత్వం లేకపోతే ఈ దేశం ముక్కలయ్యేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఝనిస్తాన్ అయ్యేది... ఒక్కసారి ఆలోచించండి, హిందుత్వం లేకుండా భారత్ లేదని ఆయన అన్నారు. నిన్నగాక మొన్న ఎంఐఎం లుచ్చా నా కొడుకుల మెడికల్ కాలేజీలో టెర్రరిస్టులను హెచ్ఓడిగా నియమించుకున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి, అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బండి పేర్కొన్నారు.


80 శాతం జనాభా ఉన్న హిందువుల వాటా సచివాలయంలో రెండున్నర గుంటలా? అని ప్రశ్నించిన బండి సంజయ్ సచివాలయం మాదే, నల్ల పోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంగా మార్చే అవకాశం మాకివ్వండని ఆయన అన్నారు. నిజాం మెడలు వంచిన ప్రాంతమిది. సీఎం గద్దెనెక్కిన తరువాత నిజాం సమాధి వద్దకు పోయి మోకరిల్లిండు, నిజాం మనవడు ఇస్తాంబుల్ లో చస్తే ఇక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారో అలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలని అన్నారు.


రాజన్న, దుర్గమ్మ, అంజన్న, కాళేశ్వర ముక్తేశ్వర స్వాముల ఆశీర్వాదం ఉంది. హిందుత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, నమ్మకండని ఆయన అన్నారు. ఒకనాడు హిందువుంటే దేశ బంధు.. ఇయాళ హిందువుంటే అన్నీ బంద్ పెడుతున్నరు. హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో హిందువుల రక్తం సలసల మసలుతోంది, నిన్నగాక మొన్న జగిత్యాలలో మామూలు ఎస్ఐ భార్య ఆర్టీసీ బస్సులో చిన్న పసిపాపకు పాలిస్తానంటే బుర్కా వేసుకున్న మహిళ ఎంతగా అవమానించిందో... ఎస్ఐను సస్పెండ్ చేసిన సంగతి మర్చిపోదామా? నిరసనగా స్వచ్ఛంద బంద్ పాటించిన జగిత్యాల ప్రజలకు హ్యాట్సాఫ్ అని అన్నారు.


Also Read: Priyanka Chopra About S*x: హవ్వ.. ప్రియాంకా శృంగారం గురించి అంత మాటనేసిందేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook