Group 1 Mains Aspirants: పరీక్ష వాయిదా కోసం పోరాడుతున్న గ్రూప్‌ 1 మెయిన్స్‌ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేశారు. నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తాను కూడా అశోక్‌నగర్‌కు వెళ్తానని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: రేవంత్‌ రెడ్డి దుర్మార్గంగా వెళ్తే గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు.. కేటీఆర్‌తో అభ్యర్థుల ఆందోళన


కరీంనగర్‌లోని లోక్‌సభ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక విషయాలపై స్పందించారు. గ్రూప్‌ 1 అభ్యర్థుల వివాదం, హైడ్రా, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలపై మాట్లాడారు. 'కాంగ్రెస్ పార్టీలోనే కొందరు నాయకులు ముఖ్యమంత్రి సీటు కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థుల గొడవ ఉధృతమై ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు.

Also Read: OU CI: మళ్లీ రెచ్చిపోయిన ఓయూ సీఐ.. స్టేషన్‌లో యువకులపై విచక్షణా రహితంగా దాడి


'గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన న్యాయమైనది. వారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. నిరుద్యోగులపై లాఠీఛార్జ్ అమానుషం. నిరుద్యోగుల వద్దకు సామాన్య కార్యకర్తగా వెళ్లి అండగా ఉంటా. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం 29 జీవోను ఉపసంహరించుకుని, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి' కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై రాక్షసంగా వ్యవహరిస్తోంది. గుంజుకొచ్చి మరీ పోలీసులతో కొట్టిస్తారా? నిరుద్యోగులు చేసిన తప్పేంది? మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందా? కాంగ్రెస్‌ను నమ్మి రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటే ఇట్ల చేస్తరా?' అని నిలదీశారు.


'జీఓ 29 నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తారా? కాంగ్రెస్ అనాలోచిత, దుర్మార్గపు, చిల్లర నిర్ణయమిది. ఈ జీఓను సవరించి న్యాయం చేయమని అడిగితే కొట్టిస్తారా? గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తే తప్పేంది' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే తారుమారమవుతాయని గుర్తు చేశారు. 


రేవంత్‌ మరో గజినీ
'హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మూసీపై రేవంత్ రెడ్డి రోజుకో మాట మారుస్త్తూ గజినీలా మారుతున్నాడు. మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని అతడే చెప్పింది. మూసీ ప్రక్షాళనకు ప్రపంచ బ్యాంకు నుంచి కాంగ్రెస్‌ అప్పు కోసం సాగిలపడుతోంది. చంద్రబాబు మోసగాడని ఉద్యమించింది కాంగ్రెస్సే. మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి నేను వ్యతిరేకం. మూసీ పేరుతో 11 వేల ఇళ్లను కూల్చడానికి వ్యతిరేకం. కాంగ్రెస్‌కు చేతనైతే.. 11 వేల కుటుంబాలకు ఇళ్లు కేటాయించి.. అన్ని విధాలా ఆదుకోవాలి' అని బండి సంజయ్‌ కోరారు.




 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter