Bandi Sanjay: రాజకీయాల్లో బండి సంజయ్ సంచలనం.. బీజేపీలోనే కొత్త ఒరవడి..
Bandi Sanjay: దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్య కానుక అందించారు.
Bandi Sanjay: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో గత కొంత కాలంగా ఎన్నికల పోలింగ్ శాతం పడిపోతోంది. ఒకవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా నగరాలు,పట్టణాల్లో పోలింగ్ శాతం 50, 60 శాతం దాటడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే మెట్రో నగరాల్లో నివసించే వారిలో చాలా మంది సొంత ఊళ్లో ఓటర్ ఐడీ కార్టులు ఉంటున్నాయి. అటు లోకల్ ఏరియాలో కూడా వారికీ ఓటు హక్కు ఉంటుంది. దీంతో చాలా మంది ఈ సమయంలో సొంత ఊరిలో ఓటు వేయడానికి ప్రియారిటీ ఇస్తున్నారు. దీంతో ఇక్కడ ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది. ఓ రకంగా హైదరాబాద్ లో 60 నుంచి 65 శాతం ఓటింగ్ నమోదు అయితే వంద శాతం నమోదు అయినట్టుగా భావించాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. నగరాలు విడిచిపెడితే.. గ్రామాల్లో కూడా పోలింగ్ రోజున తక్కువగా ఓటింగ్ నమోదు అవుతుంది. ఇది గమనించిన బండి సంజయ్ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో.. ఓటింగ్ శాతం పెంచేందుకు తన స్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేశారు. నచ్చితే ఏ పార్టీకైనా ఓటేయండి. అభ్యంతరం లేదు. కానీ తప్పనిసరిగా ఓటు మాత్రం వేయండి అని పిలుపునిచ్చారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
తన పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఏ పోలింగ్ బూత్ లోనైతే 80 శాతం, అంతకుమించి ఓట్లు పోలవుతాయో ఆ పోలింగ్ బూత్ కమిటీ బాధ్యులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల నగదు ప్రోత్సాహకంతో ఇస్తాననీ.. వారిని సత్కరిస్తానని ప్రకటించారు.
అప్పుడు అన్న మాట బండి సంజయ్ ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ప్రజాస్వామ్య కానుక అందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 80 శాతం అంతకంటే ఎక్కువ పోలింగ్ ను నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మానించారు. 10 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని సైతం అందించారు. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. ఇలా దేశంలోనే తొలిసారిగా కొత్త సాంప్రదాయానికి బండి సంజయ్ తెరతీశారు. ఏది ఏమైనా బండి సంజయ చేసిన ఈ ప్రయత్నాన్ని అందరు మెచ్చుకంటున్నారు. ః
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.