Bandi Sanjay with Jr Ntr: రాజకీయాల్లో కావచ్చు మరెక్కడైనా కావచ్చు..ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేం. నాడు బండి సంజయ్ నోటి దురుసును ఇప్పుడు మరోసారి గుర్తు తెచ్చుకుని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అసలేమైందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో యంగ్ టైగర్, టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బేటీ గత రెండ్రోజుల్నించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి కలిసినట్టు అమిత్ షా చెప్పినా..ఇరువురి మధ్య రాజకీయాలు కూడా చర్చకొచ్చాయని తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఏ విషయంపై చర్చ జరిగిందో తెలియకపోయినా..ఒక విషయంపై మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండ్ సంజయ్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి..దండం పెట్టి స్వాగతించిన ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కారణం ఏ సినిమా నటన చూసి ఆ పార్టీ అధినేత అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారో..అదే సినిమాలో ఒక స్టిల్ గురించి అదే బండి సంజయ్ చేసిన నోటి దురుసు వ్యాఖ్యల్ని ఇప్పుడు అంతా గుర్తు తెచ్చుకుంటున్నారు. 


నాడు తిట్టి..ధియేటర్లు తగలబెడతామని హెచ్చరించి..బరిసెలతో తరిమికొడతామంటూ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే బండి సంజయ్..జూనియర్ ఎన్టీఆర్ పక్కన కన్పించేందుకు ప్రయత్నించడంపై నెటిజన్లు దుమారం రేపుతున్నారు. నోటి దురుసు మంచిది కాదంటూ హితవు పలుకుతున్నారు. 


గతంలో ఏమైంది


ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం టోపీ పెట్టుకున్న స్టిల్‌పై బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. కొమురం భీంను కించపర్చేలా రాజమౌళి సినిమా తీశారని..నిజాం ఫోటోకు కాషాయం జెండా పెట్టి రాజమౌళి సినిమా తీయగలరా అని తీవ్రంగా ప్రశ్నించారు బండి సంజయ్. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేస్తే థియేటర్లు తగలబెడతామని కూడా హెచ్చరించారు. కొమురం భీంను, ఆదివాసీల హక్కుల్ని కించపర్చేవిధంగా సినిమా తీస్తున్నావని..మనోభావాలు గాయపడితే బరిసెలతో తరిమికొడతామని కూడా హెచ్చరించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. 


ఇప్పుడు అమిత్ షాతో భేటీ సందర్భంగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి కలవడం, ఫోటోలు దిగడం చూసి..జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నాడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. 


Also read: Kishan Reddy: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అందుకేనా..కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook