Telangana Politics: తన జీవితంలో కేటీఆర్‌లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదని సినీ నిర్మాత, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బండ్ల గణేశ్‌ తెలిపారు. కేటీఆర్‌ కన్నా కవిత, హరీశ్ రావు సమర్ధవంతులైన నాయకులుగా చెప్పారు. బీఆర్‌ఎస్‌తోపాటు ఏపీలోని రాజకీయ నాయకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌లో మంగళవారం గణేశ్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం


'బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌ రావు మాత్రమే సమర్థులు. తండ్రి కేసీఆర్‌ పేరు చెప్పుకొని లీడర్ అయిన వ్యక్తి కేటీఆర్' అని తెలిపారు. తండ్రి పేరు అడ్డు పెట్టుకొనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. కేసీఆర్ అబ్బాయిగా తప్పా అతడికి ఏ గుర్తింపు లేదన్నారు. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. 'రేవంత్‌ పోరాట యోధుడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారు' అని తెలిపారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని ఆరోపించారు. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నాడని చెప్పారు. 

Also Read: Telangana: మమ్మల్ని అభినందించాల్సింది పోయి.. మాపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ విమర్శలా? 


రేవంత్‌ రెడ్డిపై వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి తిట్టిస్తున్నారని బండ్ల గణేశ్‌ ఆరోపించారు. కేటీఆర్ ఫోన్‌ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారని తెలిపారు. 'మీ హయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే  ఎన్‌కౌంటర్ చేయించేవాళ్లు, రాళ్లతో కొట్టి చంపించే వాళ్లు. కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవి' అని చెప్పారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారు. కేటీఆర్ హయాంలో పని చేసిన అధికారుల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతుందని ఆరోపించారు.


ఏపీ నాయకులపై..
తనపై విమర్శలు చేసిన ఏపీ మంత్రి ఆర్కే రోజాపై బండ్ల గణేశ్‌ విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా సీఎం జగన్‌ను కూడా విమర్శించారు. 'రోజా డైమండ్ రాణి. రేవంత్ ఫైటర్. జగన్ ఒక యాక్సిడెంట్ సీఎం. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారు. పులుసు వండి పెట్టావ్ కాబట్టి పులుసు రాణి' రోజాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ ఛలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో దానిపై స్పందిస్తూ.. 'మేడిగడ్డకు వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు. మేడిగడ్డ ఎలా నాశనం చేశారో  చూసి వస్తారా?' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి