Basara IIIT students : బాసర ట్రిపుల్ ఐటీ ఘటనపై గవర్నర్ తమిళిసై ఆరా
Basara IIIT student Hurt: బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో భవనం స్లాబు పెచ్చులు ఊడిన ఘటనలో ఓ విద్యార్థి గాయపడిన ఘటనపై తెలంగాణ గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Basara IIIT student Hurt: బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో భవనం స్లాబు పెచ్చులు ఊడిన ఘటనలో ఓ విద్యార్థి గాయపడిన ఘటనపై తెలంగాణ గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో గాయపడిన ధీమత్ అనే విద్యార్థి ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుసుకుని కుదుటపడిన ఆమె.. అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. గాయపడిన సదరు విద్యార్థి ఆరోగ్యం కోలుకునే వరకు తగిన శ్రద్ధ వహించాల్సిందిగా వీసీకి సూచించారు.
బాసర ఐఐఐటిలో విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు అందివ్వకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. యూనివర్శిటీలు, కాలేజీల్లో విద్యార్థిని, విద్యార్థులు తమ చదువులపై తగిన శ్రద్ధ వహించేలా చక్కటి ఆహారం, తగిన వసతి సదుపాయాలను అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తెలంగాణ రాజ్ భవన్ నుండి ప్రెస్ సెక్రటరీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Also Read : Azadi Ka Amrit Mahotsav: రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపనకు ప్రభుత్వం ఉత్తర్వులు
Also Read : Munugode Byelection: ఎన్నికల షెడ్యూల్ రాకముందే మునుగోడుకు కేసీఆర్.. ఓటమి భయమా.. అసమ్మతికి చెక్ పెట్టడమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook