Basara IIIT students food poisoning Issue : బాసర ట్రిపుల్ ఐటీలో ఆహారం వికటించిన కారణంగా వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో సీఎం కేసీఆర్ మొదటి నుండి  కక్షపూరితమైన వైఖరితోనే వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇటీవల బాసర విద్యార్థులు సమ్మె చేసి రోడ్డెక్కడం, ఇప్పుడిలా కలుషిత ఆహారం వడ్డించడం లాంటివే తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమన్నారు  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాసర ఐఐఐటి విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా సీఎం కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారు. విద్యార్థులపట్ల అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ విద్యార్థుల పట్ల కక్షపూరిత వైఖరి మానుకుని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, వారికి నాణ్యమైన విద్య, ఆహారం, సౌకర్యాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.


Also Read : Hyderabad Traffic: ఎల్లుండి సికింద్రాబాద్‌లో బోనాల జాతర..ట్రాఫిక్‌ మళ్లింపులు ఇవే..!


Also Read : Badrachalam Flood: భద్రాచలంలో 70 అడుగులకు చేరువలో గోదావరి నీటిమట్టం.. జలదిగ్భందంలో వందలాది గ్రామాలు.. హెలికాప్టర్ ద్వారా సహాయచర్యలుస్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.