Basar IIIT: మరోసారి రణరంగంలా బాసర ట్రిపుల్ ఐటీ.. తల్లిదండ్రుల ఎంట్రీతో హై టెన్షన్
Basar IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తోడుగా పేరెంట్స్ కూడా ఆందోళనకు దిగడంతో గతంలో కంటే ఈసారి ఉద్రిక్తత ఎక్కువగా కనిపిస్తోంది.
Basar IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తోడుగా పేరెంట్స్ కూడా ఆందోళనకు దిగడంతో గతంలో కంటే ఈసారి ఉద్రిక్తత ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఆందోళనల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీల అమలుకు డెడ్ లైన్ పెట్టారు విద్యార్థులు. ఆ గడువు ముగిసినా తమ సమస్యలు సాల్వ్ కాకపోవడంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మళ్ళీ ఆందోళనకు దిగారు. ఆదివారం లంచ్ మానేసిన విద్యార్థులు వీసీ పరిపాలనా భవనం ముందు భైఠాయించారు.
ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి వచ్చి వెళ్లాకే క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో క్యాంపస్ లో సమస్యలు తగ్గాల్సింది పోయి మరింతగా పెరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. తమ సమస్యలు మొత్తం పరిష్కరించాల్సిందేనని, లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కొన్ని రోజులుగా క్యాంపస్ లో జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుంటున్నారు. విద్యార్థులకు మద్దతుగా వాళ్లంతా ఆందోళన చేస్తున్నారు. తమ పిల్లలు కాలే కడుపులతో ఉంటే తాము చూస్తూ ఎలా ఉంటామని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంచార్జ్ వీసీని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
మరోవైపు విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగడంతో ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ రంగంలోకి దిగారు. విద్యార్థుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఐదుగురు విద్యార్థుల బృందం రాత్రి ఇంచార్జ్ వీసీతో చర్చలు జరిపింది. కాని చర్చలు సఫలం కాలేదు. మెస్ కాంట్రాక్టులు వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థులు ఆందోళన విరమించాలని ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ సూచించారు.ఎక్స్‌పర్ట్ కమిటీ పరిశీలన తర్వాత కొత్త మెస్ కాంట్రాక్టరును ఫైనలైజ్ చేస్తామన్నారు.
Read also: Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. పోలీసుల హై అలర్ట్
Read also: Telangana Rains: తెలంగాణకు ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన..పిడుగులు పడే ప్రాంతాలు ఇవే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook