Bayyaram SI RamaDevi applied Third Degree on Banotu Murali: రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలపై తమ అధికార బలంను ఉపయోగిస్తూ.. చిత్రహింసలు చేస్తున్నారు. తాజాగా సాధారణ విచారణ అని పోలీస్ స్టేషన్‌కు పిలిచి.. ఏకంగా థ‌ర్డ్ డిగ్రీని ప్రయోగించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బ‌య్యారం స్టేష‌న్‌లో చోటుచేసుకుంది. బానోతు ముర‌ళి అనే నిందితుడిపై ఎస్సై ర‌మాదేవి థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దాంతో నిందితుడు ఇప్పుడు నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బానోతు ముర‌ళి, అతడి భార్య మ‌ధ్య త‌లెత్తిన వివాదం కొద్దిరోజుల క్రితం బ‌య్యారం స్టేష‌న్‌కు చేరింది. కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌డుతున్న ఎస్సై ర‌మాదేవి.. శుక్రవారం ముర‌ళిని స్టేష‌న్‌కు పిలిచి విచార‌ణ చేపట్టారు. ఈ క్రమంలోనే థ‌ర్డ్ డిగ్రీకి పాల్పడ్డారు. స్టేష‌న్‌లో నిందితుడిని చిత్రహింసలు పెట్టారు. దాంతో ముర‌ళి అరికాళ్లు, మోకాళ్లు, చేతుల‌పై తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబందించిన దృశ్యాలను బంధువులు మీడియాకు పంపించారు. 


మీడియాకు పంపిన వీడియోల్లో బానోతు ముర‌ళి ఒంటిపై గాయాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడు న‌డ‌వ‌లేక‌పోతున్నాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన ముర‌ళిని బంధువులు మ‌హ‌బూబాబాద్ ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. వైద్యులు చికిత్స అందించారు. అయితే థ‌ర్డ్ ప్రయోగం చేసిన‌ట్లుగా వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై పోలీస్ అధికారులెవ‌రూ ఇంతవ‌ర‌కు స్పందించ‌లేదు. నిజానికి భార్యాభ‌ర్తల‌కు సంబంధించిన అంశాల్లో కౌన్సెలింగ్ మాత్రమే చేయాల్సిన స్టేష‌న్ అధికారిణి ఏకంగా థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగం వ‌ర‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందో తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై బానోతు ముర‌ళి బంధువులతో పాటు ప్రజా సంఘాల నేత‌లు పోలీస్ శాఖ‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంట‌నే విచార‌ణ చేప‌ట్టి ఎస్సై ర‌మాదేవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉన్నతాధికారుల‌ను క‌లిసి తీరుతామ‌ని కొంత‌మంది లోకల్ నాయ‌కులు బాధితుడి కుటుంబ స‌భ్యుల‌కు మ‌ద్దతు తెలుపుతున్నారు. మరి ఈ విషయంపై మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.  


Als Read: IND vs SL 2nd Test: జయంత్ ఔట్.. సిరాజ్ ఇన్! జడేజా డౌట్! లంకతో డేనైట్ టెస్టులో బరిలోకి దిగే భారత జట్టిదే!!


Also Read: Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook