నిరాడంబరంగా రాములోరి కళ్యాణం..!!
భద్రాద్రి రాములోరికి కష్టమొచ్చింది. ఏటా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే రామయ్య.. ఈ ఏడాది నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చింది. `కరోనా వైరస్` ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్న నేపథ్యంలో రాములోరి పెళ్లికి కూడా కష్టం వచ్చి పడింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో భక్తులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.
భద్రాద్రి రాములోరికి కష్టమొచ్చింది. ఏటా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే రామయ్య.. ఈ ఏడాది నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చింది. 'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్న నేపథ్యంలో రాములోరి పెళ్లికి కూడా కష్టం వచ్చి పడింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో భక్తులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.
దీంతో లోక కళ్యాణార్థం ఏటా జరిగే... భద్రాద్రి రాములోరి కళ్యాణానికి భక్తులు వేల సంఖ్యలో హాజరు కాలేకపోయారు. కేవలం 40 మంది భక్తుల మధ్యే ఆ రామయ్య.. అమ్మవారు సీతమ్మను పరిణయమాడారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, మత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిరాడంబరంగా జరిగిన పెళ్లి వేడుకకు ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు కూడా హాజరయ్యారు. అతి కొద్ది మంది పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వివాహమహోత్సవం జరిగింది.
[[{"fid":"183836","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
రాములోరి పెళ్లివేడుక జరుగుతున్నంతసేపు మంత్రులు, పూజారులు, అతి కొద్ది మంది అతిధులు, మీడియా ప్రతినిధులు అంతా సామాజిక దూరం పాటించారు. భద్రాద్రి రామయ్య పెళ్లి .. చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది వచ్చిన కష్టం మరే ఏడాదిలోనూ రావద్దని భక్తులు అంతా కోరుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..