Komatireddy Venkat Reddy Meet With Priyanka Gandhi: పార్టీలో అందరం కలిసి కట్టుగా ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లో తాను స్టార్  క్యాంపెయినర్ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీతో శుక్రవారం ఆయన సమావేశం అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జులై 7 తర్వాత తెలంగాణలో  ప్రియాంక గాంధీ పర్యటనలు ఉంటాయన్నారు. ఎన్నికలకు 2 లేదా 3 నెలల ముందే సీట్ల ప్రకటన ఉంటుందని తెలిపారు. తెలంగాణాలో ప్రతి పది రోజులకు ఒకసారి ప్రియాంక గాంధీ పర్యటించాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"33 జిల్లాలు కవర్ అయ్యేలా ప్రియాంక గాంధీ ప్రచారం ఉండాలని కోరాం.. తెలంగాణాలో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవడంతోపాటు ప్రభుత్వం ఏర్పడేలా పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారు. జులై 7 తర్వాత తెలంగాణాలో పర్యటించేందుకు ఎప్పుడు అడిగిన  సమయమిస్తామని చెప్పారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణాలో పోరాడాలని సూచించారు. కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. త్వరలో అందరు కాంగ్రెస్‌లో చేరతారు. పదవులు ఎవరికి వచ్చినా ఇబ్బందేం లేదు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదు. అందరం కలిసిగట్టుగా ఉన్నాం. నేను స్టార్ క్యాంపెయినర్." అని కోమటిరెడ్డి తెలిపారు.


ఉపా కేసులు నమోదు చేయడం దుర్మార్గం..


ప్రొ.హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లలో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుత పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రొ.హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి అని.. ఆయన పౌర హక్కుల కోసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజా హక్కులను కాపాడిన మానవతా వాది అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేసిన ఉద్యమ కారుడు అని అన్నారు. నక్సలైట్ ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్.. హరగోపాల్ నక్సలైట్లకు సహకరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం ఒక అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు.


"ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో హరగోపాల్ దోషి అయితే.. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్న కేసీఆర్ కూడా దోషినే కదా..? నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్‌పై కూడా కేసులు పెడతారా..? హరగోపాల్‌తో పాటు 152 మందిపైన కేసులు ఎత్తేయ్యాలి. తెలంగాణ పౌర, ప్రజాస్వామిక సంఘాలు రాజకీయ పక్షాలు హరగోపాల్‌కు అండగా ఉండాలి.. హరగోపాల్‌తో పాటు 152 మందిపైన ఉపా కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామిక పౌర సంఘాలు బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడుతుండడంతో ప్రభుత్వాలు ఇలా పాశవికంగా ప్రవర్తిస్తున్నాయి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరగోపాల్ తోపాటు 152 మందిపైన ఉపా కేసులు ఎత్తివేస్తాం.." అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..  


Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి