Telangana New Governor: దేశంలో తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, సిక్కిం, అస్సోం, మేఖాలయ, ఛత్తీస్ గఢ్, జార్ఘండ్, పంజాబ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. మహారాష్ట్ర గవర్నరుగా సీపీ రాధాకృష్ణన్ నియమితులు కాగా, తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మను నియమించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరీ జిష్ణుదేవ్ వర్మ


దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి జిష్ణుదేవ్ వర్మను గవర్నరుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీ సీనియర్ నేతగా ఛారిలమ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. త్రిపుర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకూ పనిచేశారు. 


1957 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున జిష్ణుదేవ్ వర్మ జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. 1990 దశకంలో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీలో చేరిన ఆయన అప్పట్నించి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల్ని నిర్వహించారు.


9 రాష్ట్రాల కౌత్త గవర్నర్ల జాబితా


తెలంగాణ    జిష్టు దేవ్ వర్మ
రాజస్థాన్      హరిభౌ కిషన్ రావు బాగ్డే
సిక్కిం          ఓం ప్రకాశ్ మాధుర్
జార్ఘండ్        సంతోష్ కుమార్ గంగ్వార్
మేఘాలయ  సీహెచ్ విజయ శంకర్
మహారాష్ట్ర    సీపీ రాధాకృష్ణన్
పంజాబ్        గులాబ్ చంద్ కటారియా
అస్సోం         లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
ఛత్తీస్ గడ్     రామెన్ డేక


Also read: Big Breaking News: తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook