TS DSC Exams Schedule: నిరుద్యోగుల ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. కొన్ని వారాలుగా వాయిదా వేయాలని కోరుతున్నా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా డీఎస్సీ పరీక్షలను యథావిధిగా నిర్వహించనుంది. ఈ మేరకు డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసింది. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ వేయాలని.. ప్రస్తుత డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న నిరుద్యోగులకు మాత్రం భారీ షాక్‌ తగిలింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chalo TGPSC: పోలీస్‌ నిర్బంధాల మధ్య నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్‌


షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరుగతాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈనెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని వివరించింది. ఈ క్రమంలోనే ఈనెల 11వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. డీఎస్సీ నిర్వహణలో భాగంగా ఇటీవల టెట్‌ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టెట్‌కు, డీఎస్సీకి పొంతన లేని సిలబస్‌ ఉండడంతో ప్రిపరేషన్‌కు సమయం సరిపోవడం లేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: Revanth Reddy: యువత కోసం రేవంత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం


నిరుద్యోగుల పోరాటం
అయితే ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడాన్ని నిరుద్యోగులు తప్పుబడుతున్నారు. వాయిదా వేయాలని.. పోస్టులు పెంచాలని డీఎస్సీ అభ్యర్థులు ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా సోమవారం విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. భారీ స్థాిలో ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా డీఎస్సీ పరీక్షలను యథావిధిగా నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. వాయిదా వేసే దాకా చివరి వరకు పోరాటం చేస్తామని చెబుతున్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంటున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter