K Kavitha Bail: కవితకు భారీ షాక్.. రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
K Kavitha Bail Petition Rejected By Delhi Rouse Avenue Court: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్లను బెయిల్‌కు నిరాకరించడంతోపాటు న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం.
K Kavitha Bail: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టిపారేశాయి. దీంతో ఆమె ఇక జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. కవితకు బెయిల్ నిరాకరించడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా బెయిల్ పిటిషన్ల తిరస్కరణపై గులాబీ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ, సీబీఐ రెండూ కేసుల్లోనూ ఆమెకు బెయిల్ నిరాకరించడం గమనార్హం.
Also Read: KTR Vs Revanth: చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ప్రస్తుతం సీబీఐ, ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం సోమవారం తుది తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్లను నిరాకరించడంతోపాటు పిటిషన్ దాఖలను న్యాయమూర్తి కావేరి భవేజా తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా తాను పాల్గొనాల్సి ఉందని వాదనలు వినిపించినా కూడా న్యాయమూర్తి పట్టించుకోలేదు.
Also Read: Rahul Vs Modi: రిజర్వేషన్లపై నా సవాల్‌కు ప్రధాని మోదీజీ సిద్ధమా? రాహుల్ ప్రశ్న
బెయిల్ కోసం కవిత తీవ్ర ప్రయత్నాలు చేశారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని కవిత న్యాయవాదులు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, అరెస్టుకు సరైన కారణాలు లేవని న్యాయవాదులు చెప్పినా వినిపించుకోలేదు. ఈ వాదనలపై సీబీఐ, ఈడీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాదించడంతో వారి నిర్ణయంతో కోర్టు ఏకీభవించింది. ఈ కారణంగా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయ్యాయి. కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.
మద్యం కుంభకోణం కేసులో మార్చి 15 న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అనంతరం తిహాడ్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా భావించగా కోర్టు నిర్ణయం విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం బెయిల్ తిరస్కరణతో కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter