YS Sharmila: వైఎస్ షర్మిలకు షాకిచ్చిన నేతలు.. మూకుమ్మడిగా రాజీనామాలు
YSRTP Leaders Resigned: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో వైఎస్ షర్మిలపై సొంతపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహి షర్మిల అని విమర్శలు చేశారు. ముకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
YSRTP Leaders Resigned: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. ఆంధ్ర షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును షర్మిల చెడగొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో నిలబడతానని చివరగా అందరిని రోడ్డు మీద నిలబెట్టిందని ఫైర్ అయ్యారు.
ఇన్ని రోజులుగా షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని అన్నారు. తామంతా షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలంటే షర్మిలకు చిన్నచూపు అని.. ఆమె రాజకీయాలకు పనికిరారని అన్నారు. భవిష్యత్ కార్యచరణ త్వరలోనే చెబుతామన్నారు.
మహిళా నాయకురాలు సత్యవతి మాట్లాడుతూ.. వైఎస్సార్ అభిమానులను షర్మిల మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామంటే పార్టీలో చేరి.. పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు. వైఎస్సార్ కార్యకర్తలు అందరూ అభిమానంతో పార్టీలో చేరారని.. అందరిని మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి షర్మిలను బహిష్కరిస్తున్నామని.. ఆమె ఎవరని గౌరవించలేదు సొంత ఎజెండాతో ముందుకు వెళ్లిందన్నారు. పాదాల మీద కాదు తమ అందరి శవాల మీద నడిచేందుకు సిద్ధమైందంటూ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడ పొటి చేసిన ఓడగొడుతామని స్పష్టం చేశారు.
బయ్యారం గుట్టను దోచుకోవడానికి వచ్చిన షర్మిల ఖబర్దార్ అంటూ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ సొమ్మును దోచుకోవడానికి ఇక్కడికి వచ్చిందని.. షర్మిల తెలంగాణలో ఎక్కడా పోటీ చేసిన రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని హెచ్చరించారు. తెలంగాణలో ఎన్నో డ్రామాలు నడిపింద.. కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. తెలంగాణ ద్రోహి షర్మిలకు తగిన గుణపాఠం చెబుతామని.. తెలంగాణలో తిరిగే హక్కు లేదని స్పష్టం చేశారు.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook