Teachers Fighting Video:


బీహార్ లోని కొరియా గ్రామ పంచాయితీ విద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ క్లాస్ రూమ్స్ కిటికీలు మూసివేయడంపై మొదలైన చిన్న వాదన.. చిలికి చిలికి గాలి వానలా మారింది. మాటా మాటా పెరగడంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, మరో ఇద్దరు టీచరమ్మల మధ్య మాటల యుద్ధం కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఫైటింగ్ సీన్ లో ప్రధానోపాధ్యాయురాలు, మరో టీచరమ్మ ఒక జట్టు కాగా.. ఇంకో టీచరమ్మ ఒక్కరే ఆ ఇద్దరితో కలిసి ఫైట్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు చూస్తే అర్థం అవుతోంది.  


ఇంతకీ గొడవ ఎక్కడ వచ్చిందంటే.. క్లాస్ రూమ్ కిటీకీలు మూసేయాల్సిందిగా ఒక వర్గం.. అందుకు విరుద్ధంగా మరో వర్గం వ్యవహరించడంతోనే గొడవ మొదలైంది. ఊహించని రీతిలో కిందపడేసి తన్నుకునే వరకు వెళ్లింది. క్లాస్ రూమ్ లో మొదలైన గొడవ.. క్లాస్ రూమ్ వెనుకున్న చెరుకు చేనులో కిందపడేసి కొట్టుకునే వరకు వెళ్లింది. అంతటితో ఊరుకోని టీచరమ్మలు.. ఒకరిపై మరొకరు దుర్భాషలాడుకున్నారు. 


ఈ వివాదం, ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. టీచరమ్మలు సైతం పరస్పరం ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం, విద్యా శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని అక్కడి తాలుకా విద్యా శాఖ అధికారి వెల్లడించినట్టుగా సమాచారం అందుతోంది.