Telangana BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రానున్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుండి హరిత ప్లాజాకు వెళ్తారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నారు. ఖైరతాబాద్‌లో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్‌లో పలువురికి స్వయంగా సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు పార్టీ నేతులు చెబుతున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు నడ్డా. అంతేకాదు పార్టీలోని నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తున్నారు. హైడ్రా తీరును ఈటెల తప్పుపడుతుంటే.. రాజా సింగ్.. వినాయక నిమర్జనం సందర్భంగా  రేవంత్ రెడ్డి ధర్మం తెలిసివాడు అంటూ కితాబు ఇవ్వడంపై పార్టీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే హైకమాండ్ బీజేపీ నేతలకు చురకలు అంటించడంతో అందరు ఏకతాటిపైకి వచ్చారు.


రీసెంట్ గా  పార్టీ అధ్యక్షుడిని  మారుస్తారన్న ప్రచారం నేపథ్యంలో నేతలంతా వివిధ గ్రూపులుగా విడిపోయారు. కిషన్‌ రెడ్డి, ఈటెల రాజేందర్‌, పార్టీ సీనియర్లు ఇలా అనేక గ్రూపులు కట్టినట్టు హైకమాండ్ కు సమాచారం అందింది. మొత్తంగా తెలంగాణలో రేవంత్ సర్కారు హైడ్రాతో చేస్తోన్న హైడ్రామాను నిలదీయాలని తమ పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ శాసన సభ పక్ష సమావేశానికి ఎంపీలు సైతం కావడం వంటివి పార్టీలో ఐక్యతకు దోహదం చేశాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎప్పటి కప్పడు ఎండగట్టాలని ఈ సమావేశంలో కోరారు.


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !


 


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.