Etela Rajender Comments: కేంద్ర నిధులపై తెలంగాణలో వార్‌ కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమని.. తన వ్యాఖ్యలు తప్పని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కౌంటర్ ఇచ్చారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాడుకుంటూ తామే ఇచ్చామని కేసీఆర్ సర్కార్ చెబుతోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజల నుంచి స్పందన లేదని విమర్శించారు. అధికారులు సైతం పాల్గొనడం లేదన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఈటల రాజేందర్‌. వారికి 14,15వ ఆర్థిక సంఘం నిధులు తప్ప ఇంకేమి రావడం లేదని మండిపడ్డారు. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతోనే పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు ఈటల.


Also read: AP 10th Results: ఏపీలో రేపే పదో తరగతి ఫలితాలు..విడుదల చేయనున్న మంత్రి బొత్స..!


Also read:TS Weather Alerts: హైదరాబాద్‌లో భానుడి భగభగలు..ఉష్ణోగ్రతలు ఎంతంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook