Super Star Krishna: అపురూపమైన జ్ఞాపకం.. సెలవిక సూపర్ స్టార్ కృష్ణ.. విజయశాంతి ఎమోషనల్
Vijayashanti On Krishna: సూపర్ స్టార్ కృష్ణ అపురూపమైన జ్ఞాపకం అని విజయశాంతి అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Vijayashanti On Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో ముగినిపోయింది. కోట్లాది మంది అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నేడు కడసారి ఆయనను చూసేందుకు హైదరాబాద్‌కు వస్తున్నారు. అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నానక్‌రామ్ గూడలో కృష్ణ నివాసంలోనే పార్థీవదేహాన్ని ఉంచారు. టాలీవుడ్ సినీ అగ్రతారలతో పాటు రాజకీయా ప్రముఖులు కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మహేష్ బాబును ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. బుధవారం ఉదయం పద్మాలయా స్టూడియోకి కృష్ణ పార్థీవదేహాన్ని తరలించనున్నారు. నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.
బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన గురించి కృష్ణ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. " 'ఈ అమ్మాయి మరీ చిన్న బిడ్డలా.. నాకు కూతురిలాగా ఉంటది నిర్మలా..' అని, మీరు విజయనిర్మల గారితో అంటే.. 'నాకు తెలుసు, తను పెద్ద హీరోయిన్ అవుతుంది' అని 1980లో ఆంటీ అన్న మాట.. నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సమయంలో ఒక చక్కటి జ్ఞాపకం..
సూపర్ స్టార్ అయిన మీతో ఆ తర్వాత ఎన్నో హిట్స్, సూపర్‌హిట్స్. ఆ కిలాడీ కృష్ణుడు నుంచి ఒసే రాములమ్మ వరకు ఎన్నో సినిమాలలో కళాకారులుగా కలసి పనిచెయ్యగలిగాం.. ఇప్పుడిక వెళ్లిపోయిన ఆంటీతో పాటు మీరు కూడా.. అపురూపమైన జ్ఞాపకం.. సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు..'' అంటూ విజయశాంతి రాసుకొచ్చారు. అప్పట్లో కృష్ణ, విజయనిర్మలతో తీసుకున్న ఫొటోలను ఆమె పంచుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు మధ్యాహ్నం కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. మహేష్ బాబు, కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు.
Also Read: Note Printing Cost: కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా..!
Also Read: IPL 2023 Retention: ఐపీఎల్ 2023 రిటెన్షన్ పూర్తి, ఏ ఫ్రాంచైజీ పర్సులో ఎంత డబ్బుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook