Kaleshwaram Project:కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు.. సీఎం కేసీఆర్ అంత పని చేశారా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సంచనమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగానే విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రాత్మకమని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా... విపక్షాలు మాత్రం వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణిస్తున్నాయి.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సంచనమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగానే విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రాత్మకమని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా... విపక్షాలు మాత్రం వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణిస్తున్నాయి. తాజాగా వచ్చిన గోదావరి వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పంప్ హౌజ్ లు మునిగిపోయాయి.మూడు పంప్ హౌజ్ ల్లోకి భారీగా వరద నీరు చేరింది. బాహుబలి మోటార్లను వరద ముంచెత్తింది. అధికారుల నిర్లక్ష్యం, సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాల వల్లే కాళేశ్వరం పంప్ హౌజ్ లు మునిగిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు నీటి పాలయ్యాయని మండిపడుతున్నాయి.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కోట్ల విలువైన పంప్ హౌస్‌లు వరద నీటిలో మునిగిపోయినా.. ఇరిగేషన్ ఇంజినీర్లు ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావడం లేదన్నారు. తానే పెద్ద ఇంజనీర్ అంటూ సీఎం కేసీఆర్ చేసిన నిర్వాకం వల్లే ఇలా జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సీనియర్ ఇంజినీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోయిందని.. వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు.139 టీఎంసీల నీరు ఎత్తిపోస్తే 3 వేల కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరామరక్ష కాదన్నారు. తెలంగాణ వచ్చాక మంచి వర్షాలు పడటం వల్లే పంటలు పండుతున్నాయన్నారు ఈటల రాజేందర్.
భూసేకరణతో సంబంధం లేకుండా వేలాది ఎకరాల పంట పొలాలను కాళేశ్వరంలో ముంచేస్తుందని రాజేందర్ అన్నారు. కట్ట వేసినట్లు భూసేకరణ చేయడంతో అంచనాకు మించి భూములు జలమయం అవుతున్నాయన్నారు. చరిత్రలో మొదటిసారి మంథని, మంచిర్యాల పట్టణాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని.. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు. వరద బాధితులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. భయాందోళనలో ఉన్న గోదావరి పరివాహక ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఇంజినీర్లు శాశ్వత చర్యల గురించి ఆలోచన చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ చీఫ్ రజత్ కుమార్ బాధ్యత లేకుండా వరదలు వస్తే విదేశాలకు వెళ్లారని ఈటల మండిపడ్డారు.
Also read:CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..!
Also read:Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్..ఐదురోజులపాటు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook