Raghunandan Comments: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. రాష్ట్ర సర్కార్ తీరుపై కమలం నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏనిమిది ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీలను కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గిరిజనులకు ఇచ్చిన 12శాతం రిజర్వేషన్ హామీని ఎందుకు అమలు చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు రఘునందన్ రావు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని కాని నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు. దీంతో తండాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు రఘునందన్ రావు. దేవాలయం నుండి వచ్చే ఆదాయంతో మసీదులు నిర్మిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. తండాలో ఒక్క సేవాలాల్  గుడి కట్టలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు ప్రధానమంత్రిని, బీజేపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని రఘునందన్ రావు విమర్శించారు.


మహిళల ఆత్మగౌరవం కోసం ఇంటింటికి మరుగుదొడ్డి, ఉజ్వల పధకం ద్వారా ఉచితంగా సిలిండర్ ఇచ్చిన ఘనత  బీజేపీ ప్రభుత్వానిది అన్నారు రఘునందన్ రావు. కాంగ్రెస్ హయాంలో ఒక LED బల్బ్ ధర 600 రూపాయలుగా ఉందన్నారు. బీజేపీ పాలనలో దాని ధర 70 రూపాయలు మాత్రమే అని చెప్పారు. దేశంలో అత్యధికంగా జాతీయ రహదారులను నిర్మించిన ఘనత మోడీ ప్రభుత్వానిది అన్నారు రఘునందన్ రావు. 8 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు సెలవు పెట్టని నాయకుడు ప్రధాని నరేంద్రమోడీ అని చెప్పారు.పోడు భూములకు పట్టాలివ్వకుండా గిరిజన ఆదివాస లను కేసీఆర్ సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు.


మెడికల్ కాలేజీ పేరుతో గులాబీ నేతలు భూదందా కు తెరలేపారని రఘునందన్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారన్నారు. హత్య రాజకీయలు పెరిగిపోయాయని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ పేరుతో డబ్బులు వసూలు చేసే వారిని తరిమికొట్టాలని రఘునందన్ రావు పిలుపిచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే పొడుభూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.


Read also: IPL Media Rights: భారీ ధరకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్.. ఈసారి ఏ కంపెనీకో తెలుసా?  


Read also: Hyderabad Gang Rape: జువెనైల్ హోమ్ లో కొట్టుకున్న నిందితులు.. కార్పొరేటర్ కొడుకుపై దాడి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి