Rajasingh Got Bail: తెలంగాణ బీజేపీ నేత, ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. గతంలో పలు కేసులలో అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చాలా రోజుల నుంచి బెయిల్ వస్తుందా రాదా అనే విషయం మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ఆయనని అరెస్టు చేయడమే కాక పీడి యాక్ట్ కూడా ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటినుంచి ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా పీడీ యాక్ట్ కింద ఎవరైనా జైలుకు వెళితే కనీసం మూడు నెలల నుంచి ఏడాది వరకు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. అయితే పీడీ యాక్ట్ పెట్టే విషయంలో పోలీసులు చేసిన పొరపాట్లను ఎత్తిచూపి ఆయనను బెయిల్ పై బయటకు తీసుకురావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అయితే ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పలు షరతులతో ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరుచేసింది.


వెంటనే రాజాసింగ్ ను విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ బెయిల్ మంజూరు చేస్తూనే పలు షరతులు కూడా విధించింది తెలంగాణ హైకోర్టు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్య సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని సూచించింది. జైలు నుంచి రిలీజ్ అయ్యాను కదా అని ప్రెస్ మీట్ లు పెట్టి రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని రాజాసింగ్ కు హైకోర్టు సూచించింది.


అయితే గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రాజాసింగ్ పీడీ యాక్ట్ లో అరెస్ట్ అయిన కొద్ది రోజులకే బిజెపి హై కమాండ్ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఈ విషయం మీద షో కాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రాజాసింగ్ తరఫున ఆయన భార్య ఉషా భాయ్ తన భర్త తప్పేమీ లేదని కావాలని కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను పలు కేసుల్లో ఇరికించి పిడీ యాక్ట్ కూడా పెట్టి అరెస్టు చేయించిందని షో కాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చారు.


ఇటీవలే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను కలిసిన ఆమె తన భర్తను ఎలా అయినా బయటకు తీసుకురావాలని అలాగే సస్పెన్షన్ ఎత్తివేసే విషయంలో కూడా అధిష్టానం దగ్గర కాస్త మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.  ఇక ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎట్టకేలకు ఈ బెయిల్ రావడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
Also Read: Gangula Kamalakar: దుబాయ్ లో మంత్రి.. ఇళ్లు పగలకొట్టి సోదాలు మొదలెట్టిన అధికారులు.. పొలిటికల్ సర్కిల్స్ లో కలకలం!


Also Read: Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... రాహుల్ గాంధీ హామీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook