BJP MLA'S submits petition in High Court: తెలంగాణ అసెంబ్లీ స్పెన్షన్‌ను సవాల్ చేస్తూ మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే కొట్టివేయాలని వారు హైకోర్టును కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు పిటిషన్‌లో పేర్కొన్నారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ... హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సస్పెన్షన్ విషయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో తొందరలోనే రాష్ట్రపతిని కలుస్తామన్నారు. అసెంబ్లీలో స్పీకర్ తీరు కీలు బొమ్మలా మారిందని రఘునందన్ అన్నారు. ఇలాంటి ఘటనలో ఏపీ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చినట్టు ఆయన గుర్తుచేశారు. ఏ సెక్షన్ కింద మమల్ని సస్పెండ్ చేశారో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని  దుబ్బాక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 


సోమవారం తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ ప్రవేశపెడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రఘునందర్​రావు, రాజాసింగ్ అడ్డుతగులుతున్నారంటూ సభ నుంచి సస్పెండ్​ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఈ సెషన్​ పూర్తయ్యే వరకు బీజేపీ సభ్యులను సస్పెండ్​ చేస్తున్నట్లు స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 


సస్పెండ్‌కు నిరసనగా అసెంబ్లీ బయటకొచ్చి ఆందోళనకు దిగిన ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, రాజా సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఆపై బొల్లారం పోలీస్‌ స్టేషనుకు తరలించి.. మధ్యాహ్నం 2 గంటలకు వదిలేశారు. తమను సస్పెండ్‌ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్యనేతలు కె లక్ష్మణ్‌, ఎన్‌ రాంచందర్‌రావు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 


Also Read: RCB New Captain: 12న కొత్త కెప్టెన్‌ని ప్రకటించనున్న ఆర్‌సీబీ.. ఎవరో తెలుసా?! కోహ్లీకి కూడా ఇష్టమేనట!!


Also Read: Women MLA Horse Riding: గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook