కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 21 ఏళ్ల వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వైష్ణవ్ దత్తాత్రేయకు ఒక్కడే కుమారుడు. చిన్నవయసులో గుండెపోటుతో వైష్ణవ్ మృతి చెందడంపై మరణవార్త విన్నవారందరూ దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. వైష్ణవ్ మరణవార్త విన్న వెంటనే సన్నిహితులు, మిత్రులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING