గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ( Greater Hyderabad Elections ) సందడి ప్రారంభమైంది. నేతలు ఆరోపణలు వేడెక్కుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు పురస్కరించుకుని బీజేపీ ఎంపీ ధర్మపురి  అరవింద్ ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ( Nizamabad Bjp Mp Dharmapuri Aravind ) ఇటీవలి కాలంలో సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని పురస్కరించుకుని చేిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో తమకు పోటీ టీఆర్ఎస్ ( TRS ) కానేకాదని...మజ్లిస్ ( Majlis ) తోనే పోటీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో  పోటీ ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్టాఫ్ సిటీ మధ్య ఉండనుందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు అహంకారం తలకెక్కిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే వరద సహాయాన్ని తామెందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో 45 సీట్లు వర్సెస్ 105 సీట్లు ఉంటుందన్నారు.


రాష్ట్రంలో ఇల్లు రావాలన్నా.. రిజర్వేషన్లు కావాలన్నా బీజేపీతోనే సాధ్యమని ఎంపీ అరవింద్ తెలిపారు. మజ్లిస్, టీఆర్ఎస్ లు దోచుకు తింటున్నాయి తప్ప చేసిందేమీ లేదన్నారు. మతాల్ని పక్కనబెట్టి..బీజేపీకి ఓటేయమని కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకు మూడంకెల సంఖ్య కూడా దాటదన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ తమ లక్ష్యమని చెప్పారు. బీజేపీకు ఓటేస్తే గుజరాత్ లా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల కమీషన్ టీఆర్ఎస్ చేతుల్లో సంస్థగా మారిందని విమర్శించారు. Also read: GHMC elections: పవన్ కళ్యాణ్‌ను కలవటంలేదు: బండి‌ సంజయ్