భైంసా : నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లకు ( Bhainsa riots ) ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపి ఎంపీ సోయం బాపూరావు ( BJP MP Soyam Bapu Rao ) డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రజలను తప్పుదోవ పట్టించి, ఏమీ తెలియని అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. బైంసాలో ఒక వర్గం మెప్పు పొందడం కోసం, వారి ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని ఆరోపించిన బాపూరావు.. బైంసాలో ఎంఐఎం నేతలు, ఆ పార్టీకి చెందిన కార్యకర్తలపై కేసులు పెట్టె దమ్ము పోలీసులకు ఉందా అని సవాలు విసిరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also : భైంసాలో అర్థరాత్రి అల్లర్లు


భైంసా అల్లర్ల ఘటనపై బాపూరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ బైంసా ఎంఐఎం నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  భైంసా ఘటనలో పోలీసులు అమాయకులను అరెస్ట్ చేసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వం, ఎస్పీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..