TRS BIKE RALLY: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనలతో హైదరాబాద్ లో రాజకీయ సందడి కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. బీజేపీ సమావేశాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న నేతలు పాతబస్తీ చార్మీనాగ్ దగ్గరనున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తున్నారు. దీంతో పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నెక్లెస్ రోడ్ జలవిహార్ వరకు 10 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీలతో బేగంపేటకు వస్తున్నారు. ఎక్కడికక్కడ బలప్రదర్శనకు దిగుతున్నారు. ఈ క్రమంలో చార్మీనార్ దగ్గర టీఆర్ఎస్ నేతలు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ తీయడం సరికాదని సూచించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.


ఇక ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆథిత్యనాథ్ ఆదివారం చార్మీనార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రానున్నారు. మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం శనివారమే యోగీ ఆలయానికి రావాలి. కాని ఆ షెడ్యూల్ ను రద్దు చేశారు. ఆదివారం యోగీ ఆలయానికి వస్తారని అధికారులు చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Read also: Telangana Survey: తెలంగాణ లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్.. ఆ పార్టీకి మూడో స్థానమే?


Read also: Covid Cases: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. మరో మూడు వారాలు డేంజరే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook