PM MODI: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరబాద్ ముస్తాబైంది. శని, ఆదివారాల్లో జరిగే సమావేశాల కోసం సర్వం సిద్ధం చేశారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో  కార్యవర్గ సమావేశలు జరగనుండగా.. జూలై ౩న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హెచ్ఐసీసీతో పాటు పరేడ్ గ్రౌండ్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగడం ఇది రెండోసారి. అటల్ బిహరీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2003లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అత్యున్నత సమావేశాలకు భాగ్యనగరం వేదికైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజులు హైదరాబాద్ లో ఉండనున్నారు. జూలై 2న హైదరాబాద్ చేరుకునే మోడీ.. జూలై 4న తిరిగి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. జూలై 2 శనివారం మధ్యాహ్నం 12 .45 నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ హైదరాబాద్ కు బయలుదేరుతారు. 2 గంటల 55 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మాదాపూర్  హెచ్ ఐసీసీకి వెళతారు. 3 గంటల 20 నిమిషాలకు నోవాటెల్ కు చేరుకుంటారు ప్రధాని మోడీ. కాసేపు రెస్ట్ తర్వాత సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు. రాత్రి 9  గంటల వరకు సమావేశంలోనే ఉండనున్నారు నరేంద్ర మోడీ.


జూలై 3 ఆదివారం ఉదయం 10 గంటలకు సమావేశాలకు వస్తారు. సాయంత్రం 4 గంటల 30 వరకు సమావేశాల్లోనే ఉంటారు. పలు అంశాలపై కార్యవర్గ సభ్యులకు మోడీ దిశానిర్దేశం చేస్తారు. తర్వాత హోటల్ కు వెళతారు. కాసేపు విరామం తర్వాత పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న  విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు సాయంత్రం 5:55 గంటలకు హెచ్ఐసీసీ నుంచి బయలుదేరుతారు. 6 గంటల 15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్ కు వెళతారు. రాత్రి 7 గంటల 30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రసంగం తర్వాత రాజ్ భవన్ లేదా మాదాపూర్ నొవాటెల్ లో ప్రధాని మోడీ బసచేయనున్నారు. ఆదివారం రాత్రి ప్రధాని బసకు సంబంధించింది ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.


మూడవ రోజైన జూలై 4 సోమవారం ఉదయం  9:20కి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో  విజయవాడ వెళతారు ప్రధాని నరేంద్రమోడీ.  భద్రత కారణాలతో మోడీ పర్యటనలో కొన్ని మార్పులు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల టూర్ లో ప్రధాని మోడీని ఎవరిని కలుస్తారు.. ఆయన ఎవరెవరికి అపాయింట్ మెంట్లు ఇచ్చారన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాని మూడు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్ సిటీ, పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పూర్తిగా భద్రతా వలయంలో ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


Read also: TS TET 2022: ఇవాళ తెలంగాణ టెట్ ఫలితాలు రిలీజ్... త్వరలో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


Read also:  Alluri Jayanthi: మన్యం వీరుని జయంతి వేడుకలకు చిరుకు ప్రత్యేక ఆహ్వానం వెనుక ఏపీ సీఎంవో ప్రమేయం ? అసలేం జరుగుతోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి