గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆరోపణలు అప్పుడే ప్రారంభమైపోయాయి. ఆ సంతకం తనది కాదని...ఫోర్జరీ చేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఏమా సంతకం..కధేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇటీవల భారీ వర్షాలు, వరదల ( Heavy rains and floods ) కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద సహాయంగా తెలంగాణ ( Telangana ) లోని టీఆర్ఎస్ ప్రభుత్వం ( TRS Government ) బాధితులకు పదివేల రూపాయల్ని అందిస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కోడ్ కారణంగా ఈ వరద సహాయాన్ని నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశించింది. 


అయితే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ( Bjp president Bandi sanjay ) ఎన్నికల కమీషన్ కు వరద సహాయం ఆపాల్సిందిగా కోరుతూ ఎన్నికల కమీషన్ కు ఓ లేఖ రాశారని..అందుకే ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయం తీసుకుందనే వార్త ట్రోల్ అవుతోంది. బండి సంజయ్ తన లేఖతో పేదల నోట్లో మట్టి కొట్టారని టీఆర్ఎస్  (TRS ) వర్గాలు ట్రోల్ ప్రారంభించాయి. దాంతో బండి సంజయ్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఆ లేఖ తాను రాయలేదని..తన సంతకాన్ని ఫోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపిస్తున్నారు. 


టీఆర్ఎస్ నేతలే తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. వరద సాయం ( Flood Relief ) బీజేపీ ఆపలేదని చెప్పేందుకు..చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.  సీఎం కేసీఆర్ ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. తెలంగాణలోనే ఏం చేయలేని కేసీఆర్ ..ఢిల్లీలో ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. Also read: Rs 10,000 GHMC flood relief: వరద బాధితులకు షాక్.. వరద సాయం నిలిపేయాలని ఆదేశాలు