Bandi Sanjay Comments On Warangal CP: 'వైజాగ్ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవీఐ) బిడ్డింగ్‌లో పాల్గొంటానడం చూస్తే నవ్వొస్తుంది. సక్రమంగా జీతాలే ఇయ్యలేనోడు, రుణమాఫీ, నిరుద్యోగ భృతిసహా ఇచ్చిన హామీలను అమలు చేయలేనోడు వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడతాడట. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు.. పిన్నతల్లికి బంగారు కడియాలు చేయిస్తానన్నట్లుంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నయ్ కదా.. ఏమైంది..? నీకు దమ్ముంటే బయ్యారం స్టీల్‌ను ఏర్పాటు చేయ్..' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. తన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంపై మండిపడ్డారు. వరంగల్ సీపీ అంతు తేలుస్తామని.. అవినీతి, అక్రమాల చిట్టాను త్వరలోనే బయపెడతానని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద దేవి థియేటర్లో  'బలగం' సినిమాను బండి సంజయ్ వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మానవ సంబంధాలు, కుటుంబ బంధాల గురించి అద్బుతంగా చూపించారని డైరెక్టర్ వేణును అభినందించారు. కలెక్షన్లు, పబ్లిసిటీ కోసం చూడకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి మంచి సందేశాన్ని అందించేందుకు యత్నించిన దిల్ రాజుసహా సినిమా యూనిట్‌కు అభినందనలు తెలిపారు. థియేటర్‌కు వచ్చి చూడటం ద్వారా సినిమా పరిశ్రమకు బలాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి సినిమా చూశానని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాల్లేవన్నారు. గతంలో రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి సమయంలో చాలా ఇబ్బంది పెట్టారని.. మొన్న మా అత్తమ్మ చనిపోతే పక్షి ముట్టే కార్యక్రమానికి వెళితే అకారణంగా, అన్యాయంగా అరెస్ట్ చేయించి దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.


బెయిల్ రద్దు చేయాలని పోలీసులు చెప్పడంలో సంచలనమేముంది..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వాళ్లు రబ్బర్ స్టాంపులు అని.. సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే చేస్తున్నారని అన్నారు. అయినా తన బెయిల్ ఎందుకు రద్దు చేయాలని.. తానేమైనా టెర్రిరిస్టునా..? నక్సలైట్‌ నా..? అని అడిగారు. ఈటల రాజేందర్‌కు ఎందుకు నోటీసులు ఇచ్చారని.. ఆయన చేసిన తప్పేముందన్నారు. దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు.  


Also Read: MLA Etela Rajender: టెన్త్ పేపర్ లీక్ కేసు.. విచారణకు హాజరైన ఎమ్మెల్యే ఈటల.. పోలీసులు ఏం అడిగారంటే..!


'మాట్లాడితే ఫోన్ అంటున్నారు. కరీంనగర్‌లో నన్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి సిద్దిపేట వరకు ఫోన్ ఉంది. నా పీఏ, నేను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాం. ఫోన్‌ను  వాళ్లే తీసుకుని నాటకాలాడుతున్నారు. నా ఫోన్‌ను సీఎం చూసిన తరువాత  చక్కెరొచ్చి పడిపోయిండట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల కాల్ లిస్ట్ చూసి ఇంతమంది టచ్‌లో ఉన్నారా..? అని విస్తుపోయిండు. 


వరంగల్ పోలీస్ కమిషనర్ బాగోతమంతా తీస్తున్నా. విజయవాడ సత్యబాబు కేసు మొదలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సంపాదించిన ఆస్తులు, అక్రమాలన్నీ వెలికితీస్తున్నా. అమాయకులపై కేసులు పెట్టి, సంబంధం లేని వ్యక్తులను రిమాండ్‌కు పంపడానికి నీకు ఎవరు అధికారమిచ్చారు..? నీకు దమ్ముంటే నీ ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టు.. నువ్వు సీఎంతో, మంత్రులతో ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు ఈ కేసు గురించి మాట్లాడినవో తెలుస్తుంది..' అని అన్నారు.


Also Read: PM Kisan Samman Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook