Flexi War: హైదరాబాద్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. నగరంలో ఎటు చూసిన పార్టీల జెండాలు, హోర్డింగులు, ఫ్లైక్సీలు, బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో  నగరాన్ని కాషాయమయం చేశారు కమలనాధులు. హైదరాబాద్ మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ నిలువెత్తు హోర్డింగులు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇక బీజేపీ ధీటుగా టీఆర్ఎస్ పార్టీ కూడా బ్యానర్లు కట్టింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం హైదరాబాగ్ వస్తున్నారు. యశ్వంత్ టూర్ కు తమకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ పార్టీ... ఆయనకు వెల్ కం చెబుతూ భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వరకు.. అవుట్ రింగ్ రోడ్డు, ఫ్లై ఓవర్లు.. వేటిని వదల్లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ కాషాయ జెండాలు, టీఆర్ఎస్ గులాబీ జెండాలతో భాగ్యనగరం నిండిపోయింది. అదే సమయంలో బ్యానర్లు, ఫ్లెక్సీల విషయంలో పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన జెండాలు, బ్యానర్లు తొలగిస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఫ్లైక్సీల గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తమ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటే, తమవి తీసేస్తున్నారని బీజేపీ, టీఆర్ఎస్  పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రెసిడెంట్ ఎన్నికల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తొలగించారంటూ ప్రభుత్వ చీఫ్‌విప్‌ బాల్క సుమన్‌ సైబరాబాద్‌ సీపీకి కంప్లైంట్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్డుపై తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గచ్చిబౌలీలో సైబరాబాద్‌ సీపీని కలిసి తన ఫిర్యాదు అందించారు బాల్క సుమన్. ఫ్లెక్సీలను చింపేసిన ఫోటోలను సైబరాబాద్ సీపీ అందించారు.  


ఇక బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీల రగడతో కాంగ్రెస్ కూడా ఎంటరైంది.  నెక్లెస్ రోడ్డులోని ఇందీరాగాంధీ విగ్రహం దగ్గర బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీహా జెండాలు కట్టాయి. ఇందిరాగాంధీ విగ్రహాన్ని ముంచేశాయి.దీనిపై కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేశారు. ఇందిరా విగ్రహం చుట్టూ ఇతర పార్టీల జెండాలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. యువజన కాంగ్రెస్‌ నేత అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీ, టీఆర్ఎస్ జెండాలు తొలగించారు.దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఫ్లైక్సీలు, బ్యానర్లు, జెండాల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.


Read also: Heavy Rains: అర్ధరాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం.. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం  


Read also: Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook