హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్నీ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ఆయన మీడియా  సమావేశంలో తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్(పునర్విభజన) ప్రక్రియ 2026లో జరుగుతుందని మంత్రి చెప్పారు.రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న  మున్సి పల్ ఎన్నికలలో ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, 2019 పార్లమెంటు ఫలితాలు పునరావృతమవుతాయని, పోటీ టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీల మధ్య మాత్రమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న చాలా రకాల సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం కోసం ఎటువంటి వినతి చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని అన్నారు. గత  యుపీఏ, ప్రస్తుత ఎన్డిఏ పాలనలో రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


హైదరాబాద్ ను   దేశానికి రెండవ రాజధానిగా మారుస్తున్నట్లు వస్తున్న పుకార్లపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఎటువంటి ప్రతిపాదన చేయలేదని, అనవసర ఆందోళనలకు గురికావద్దని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..