హైదరాబాద్: ఇసీఐఎల్‌కు సమీపంలోని కాప్రా చౌరస్తాలో ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో పలువురు గాయపడగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పేలుడు ధాటికి భవనం సగభాగం ధ్వంసం కాగా కిలో మీటర్ పరిధిలోని భవంతుల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పొరుగునే వున్న భవనాలు సైతం కంపించాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 


అయితే, ఈ పేలుడుకు సిలిండర్లు కారణమా ? లేక జిలెటిన్ స్టిక్స్ నిల్వ చేయడమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.