మెదక్‌: పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోరు బావిలోపడిన సంజయ్‌ సాయి వర్దన్‌‌ని ప్రాణాలతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 120 అడుగుల లోతు వేయించిన బోరు బావిలో 17 అడుగుల వద్ద బాలుడి మృతదేహం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం 12 గంటల పాటు శ్రమించిన అనంతరం బోరుబావిలో మట్టిపెళ్లలు కింద బాలుడి మృతదేహం లభ్యమైంది. అప్పటివరకు తమ కన్నకొడుకు బతుకుతాడేమో అని వేయి కళ్లతో ఎదురుచూసిన సాయి వర్ధన్ తల్లిదండ్రుల దుఖానికి అంతులేకుండా పోయింది. బాలుడు ఇక లేడని తెలియడం అందరినీ కంటతడి పెట్టించింది.  ( Boy struck in borewell : బోరు బావిలో పడిన బాలుడు.. స్పందించిన మంత్రి హరీష్ రావు )


ఆక్సిజన్‌ అందకపోవడంతో పాటు బాలుడిపైన మట్టి పెళ్లలు కూలడం వల్లే అతడు మరణించి ఉంటాడని రెస్య్యూ టీమ్ ఓ ప్రాథమిక నిర్థారణకు వచ్చింది. బోరుబావిలో పడిన సాయివర్థన్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరోక్షంగా బాలుడి మృతికి కారకుడైన పొలం యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..