Breaking News: సైదాబాద్ కామాంధుడి ఆత్మహత్య... దేవుడున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్
సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి తప్పించుకుంటున్న రాజు మృతదేహాన్ని వరంగల్ రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు కనుగొన్నారు. హత్యా? ఆత్మ హత్యా ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Saidabad Incident: హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రేల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. చేయి పై ఉన్న మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా మృతదేహం రాజుదే అని పోలీసులు స్పష్టం చేసారు.
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో గురువారం (సెప్టెంబర్ 9) ఇంటి ముందు చిన్న పిల్లలతో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని చాక్లెట్ ఆశ చూపించి, నిందితుడు రాజు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
Also Read: AP High Court: జిల్లా పరిషత్ ఎన్నికలు తిరిగి నిర్వహిస్తారా..ఇవాళే హైకోర్టు తీర్పు
భాదిత కుటుంబం నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. అక్కడి నుండి హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది . అక్కడే నివసించే రాజు మద్యం మత్తులో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేయటం, పలు సంఘాలు, సామాజికవేత్తలు మరియు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు రాజు ఆచూకీ పట్టించిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Social Media: కరోనాపై అసత్య ప్రచారంలో ఏయే దేశాలు ముందున్నాయో తెలుసా
ముమ్మరంగా జరిపిన గాలింపులో హైదరాబాద్ టాస్కఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు దొరికాడు. మొదటగా సీసీ ఫుటేజ్ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు, రాజుకు తోడుగా ఎల్బీనగర్ వరకు అతడి స్నేహితుడు కూడా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్ నుంచి రాజు ఒంటరిగా నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook