Telangana Politics: భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని వీడిన పలువురు ఎమ్మెల్యేలు. ఇప్పటికే దానం నాగేందర్ పాటు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఈ లిస్టులో 6 ఎమ్మెల్సీలు దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య, యోగ్గె మల్లెశం, బొగ్గారపు దయానంద్, గురువారం అర్ధరాత్రి హస్తం గూటికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయానికే అమావాస్య ఉండటం వంటి కారణాలతో గురువారం రాత్రి 1 గంట సమయంలో  ఈ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ  సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ ప్రక్రియ అంతా సాగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం రాత్రి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో సమావేశమైన ఈ ఎమ్మెల్సీలు.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి, పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.


ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి చెందిన 6 గురు శాసనసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే కదా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు.. కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ రెడ్డి,   తెల్లం వెంకట్రావు,  కాలె యాదయ్య, సంజయ్ కుమార్.. హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇందులో దానం నాగేందర్ .. కాంగ్రెస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు కడియం కూతురు కావ్య మాత్రం వరంగల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంగతి యాది మరవకముందే.. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారడం బీఆర్ఎస్  పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.


తెలంగాణ శాసన మండలిలో సభ్యులు 40 మంది ఉన్నారు. అందులో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఓ ఎమ్మెల్సీ తిహాడ్ జైలులో ఉన్నాడు.


ఈ ఏడుగురు ఎమ్మెల్సీల చేరికల తో కాంగ్రెస్ బలం 13కు చేరింది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ పార్టీకి 29 మంది సభ్యుల బలం ఉంది. అందులో 6 గురు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం మండలిలో 21కి పడిపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టచ్ లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. మొత్తంగా మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 15 అని చెప్పాలి. ఏది ఏమైనా మండలిలో పలు బిల్లులకు బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉండటంతో అక్కడ కొన్ని బిల్లులకు అడ్డుతగిలే అవకాశాలు ఉండటంతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు గాలం వేస్తూ.. మండలిలో బలం పెంచుకునే పనిలో పడ్డారు.


Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook