MLC Kavitha On Adani Enterprises Share Price Down: అదానీపై కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని విమర్శించారు. సోమవారం ఆమె శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అదానీతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల షేర్ల విలువ గత నెల 23వ తేదీ నుంచి భారీగాపడిపోయాయి. దీంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగింది. రూ.3600 గా ఉన్న ఆదానీ షేర్ విలువ ఇప్పుడు దాదాపు రూ.1400కు పడిపోయింది. దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే అంతా బాగేనే ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారు..? ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి. 


నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. అదానీ వ్యవహారంపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉంది. మోదీ మద్ధతుతో అదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసు. అదానీ వ్యవహారంపై ఎవ్వరు ప్రశ్నించినా అంతా బాగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వు బ్యాంకు చెబుతున్నారు. ఏ ప్రభుత్వం మద్ధతుతో అదానీ రూ.60 వేల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికి తెలుసు..' అని కవిత అన్నారు.


కేంద్రంలోని మోదీ బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపర్చితే కేసీఆర్ బడ్జెట్ మాత్రం దేశానికి స్పూర్తినిస్తుందని కవిత అన్నారు. రూ.2.9 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమన్నారు. దేశానికి స్పూర్తిగా నిలిచే అంశాలు ఈ బడ్జెట్‌లో ఎన్నో ఉన్నాయని వివరించారు. దామాషా ప్రకారం బడ్జెట్‌ ను కేటాయించామని, సామాజిక రంగంలో ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను విస్మరించిందని విమర్శించారు. దేశంలో లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కోత విధించిందని, తక్షణమే ఆ పథకానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను నేరుగా స్థానిక సంస్థలకు ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్‌కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్


Also Read: Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్ ఎంతంటే..? శాఖల వారీగా కేటాయింపులు ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి