MLC Kavitha Slams PM Modi: అదానీ సంస్థల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రూ.10 లక్షలు ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా..? అని ప్రశ్నించారు. హిడెన్ బర్గ్ నివేదిక బయటకు వచ్చిన పది రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో  2వ స్థానం నుంచి 22వ స్థానానికి పడిపోయారని అన్నారు. అనేక ప్రభుత్వరంగ సంస్థల నుంచి అదానీ సంస్థ  అప్పులు తీసుకుందని.. ఈ సంస్థలో ఎల్‌ఐసీ రూ.80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. అదానీ షేర్లు పడిపోవడంతో ఎల్ఐసీ 18 వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అదానీ సంస్థల్లో ఎస్బీఐ రూ.27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుయ రూ.5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు, ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయి. హిడెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51 శాతం పడిపోయాయి. ఎల్ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయింది. ఎల్ఐసీ షేర్లు కొని దిగువ, మధ్య తరగతి ప్రజలు భారీగా నష్టపోయారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలి.


రాష్ర్టపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. అదానీ విషయంపై ఎందుకు మాట్లాడలేదు..? రూ.10 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీకి ప్రజలపై పట్టింపు లేదు..' అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వ కాపీకొట్టి.. పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందన్నారు. జగిత్యాల జిల్లా నుంచి 50 వేల మంది, నిజామాబాద్ నుంచి 60 వేల రైతులను పీఎం కిసాన్ పథకం నుంచి ఎలాంటి కారణం లేకుండా తొలగించారని అన్నారు. అయితే ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా  11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేశామని నిండు సభలో అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. 


Also Read: Ind Vs Aus: షమీ దెబ్బకు వార్నర్ మైండ్‌బ్లాక్.. గాల్లో ఎగిరిపడ్డ స్టంప్స్  


Also Read: ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల హవా.. నంబర్ టు ప్లేస్‌కు హార్ధిక్ పాండ్యా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook