Warangal MP Seat: వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై భారీ ట్విస్ట్‌లు.. ఉద్యమకారుడికి కేసీఆర్ అవకాశం
KCR Announced BRS Party MP Candidate Marepalli Sudheer Kumar: వరంగల్ ఎంపీ సీటుపై సుదీర్ఘ చర్చల అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది. ఉద్యమకారుడు, వైద్యుడైన సుధీర్ కుమార్‌కు గులాబీ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు.
Marepalli Sudheer Kumar: తెలంగాణలో అత్యంత ఉత్కంఠ.. ఆసక్తికర పరిణామాలు వరంగల్ లోక్‌సభ స్థానంలో చోటుచేసుకుంటున్నాయి. కడియం కావ్య పార్టీ ఫిరాయించిన స్థానంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడికి అవకాశం కల్పించారు. ఆయనే హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
Also Read: Harish Rao: చీము నెత్తురు ఉన్నోళ్లు ఎవరూ కాంగ్రెస్, బీజేపీకి ఓటేయరు: హరీశ్ రావు వ్యాఖ్యలు
వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి అనేక ట్విస్ట్‌లు జరిగాయి. పార్టీని వీడిన స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు పిలుపు రావడంతో ఒక్కసారిగా ఆసక్తికర చర్చ జరిగింది. వరంగల్ స్థానం ఆయనకు ఇస్తారనే వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నాయకులతో కేసీఆర్ చర్చించారు. అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా చర్చలు చేశారు. ఈ సమయంలో అనూహ్యంగా సుధీర్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. పార్టీ వెంట నిరంతరం ఉంటున్న సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని అందరూ ఆహ్వానించారు. దీంతో అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్‌ను ప్రకటించారు.
సుధీర్ నేపథ్యం..
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన మారేపల్లి సుధీర్ కుమార్ వృత్తిరీత్యా వైద్యుడు. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నారు. పార్టీకి విధేయుడుగా ఉంటున్న సుధీర్ కుమార్‌కు అవకాశం కల్పించారు. పార్టీని వీడి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన కడియం కావ్యపై సుధీర్ కుమార్ గట్టి పోటీ ఇస్తారని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter