KTR vs Revanth In Assembly:'యాచిస్తే కాదు.. శాసిస్తేనే ఏదైనా సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పేవారు. ఇప్పుడు అదే ఆలోచన చేయాలని నేను ప్రజలను కోరుతున్నా' అని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. 'కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా సరే మేము తెలంగాణ ప్రయోజనాల పనిచేశాం. శాసించి చేసుకోవాలే తప్ప...యాచిస్తే ఈ కేంద్రం లొంగదు' అని కేటీఆర్‌ తెలిపారు. కేంద్రంలో బీజేపీ వాళ్ల నీతి మాలిన వ్యవహారాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటామని చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం


'ఇప్పుడు 8+8 అంటే గుండుసున్నా అనే పరిస్థితిని తెచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా మనకు జరిగిన అన్యాయాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు' అని కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీని బడే భాయ్ అని సంబోధించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. 'మేము గతంలో చెప్పిందే మీకు ఇప్పటికీ అర్థం అయ్యింది. ఏమీ చేసిన సరే వాళ్లది తెలంగాణకు అన్యాయం చేయాలనే  తత్వమే ఉందన్నది మీకు ఇప్పుడు బోధపడింది' అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లు ఎవరైనా సరే వాళ్ల మెడలు వంచేందుకు బీఆర్ఎస్ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.

Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్‌.. త్వరలోనే ఆమెపై రేవంత్ చర్యలు?


 


విలీనం కాదు.. గ్యారంటీల కోసం కొట్లాడుతాం
'కేంద్ర బడ్జెట్ మీద ఇక్కడ కాదు. లోక్‌సభలో కాంగ్రెస్ 99 మంది ఎంపీలు పోరాటం చేయాలి. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. మా జెండాలు మారదు. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. చీకటి ఒప్పందాలు, విలీనం అంటూ రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఉన్నట్లు ఉంది. మేము ఎక్కడికి పోము. మిమ్మల్ని ఎండగడుతాం. మీపై పోరాడుతాం. ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు కచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం. పంజాబ్ కు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగితే ఆ రాష్ట్ర ఎంపీలు నిరసన తెలిపారు. మరి మన రాష్ట్ర ఎంపీలు ఎక్కడ పోయారు. ఎందుకు నిరసన తెలుపలేదు. బడేభాయ్..చోటే భాయ్ అని అన్నదమ్ములు సెంటిమెంట్ తెస్తే మన రాష్ట్రానికి ఏం వచ్చింది' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


'రాష్ట్రానికి అన్యాయం జరిగితే కలిసి కొట్లాడతాం. కానీ గతంలో ఇదే బీజేపీ వాళ్లు గవర్నర్ ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడితే కేంద్రానికే సహకరించారు. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పని చేస్తుంది. ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఏ విలీనం, ఏ చీకటి ఒప్పందాలు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏం చేసినా బజాప్తా చేస్తాం. మీ లాగా మేము మోడీ పేరు తీసుకోవటానికే భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికీ కూడా సీఎం పనులను ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చక్కబెడుతున్నారు. కానీ మాకు ఆ అవసరం లేదు. మేము తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతాం' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.


రేవంత్‌ పరాన్నజీవి
ఒక దళితుడు రాష్ట్రపతి అవుతున్నారంటే అప్పుడు మేము బీజేపీకి మద్దతు ఇచ్చాం. ఒక తెలుగు వ్యక్తి ఉప రాష్ట్రపతి అవుతుంటే కచ్చితంగా మేము మద్దతిచ్చాం. మా పార్టీని విలీనం చేసేందుకు మేము రేవంత్ రెడ్డి లాగా పరాన్న జీవులం కాదు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం అని మాట్లాడుతున్నారు' అని కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు.


రేవంత్‌ సమాధానం చెప్పాలి
'అసలు 8 ఎంపీలను కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇస్తే మీరు రాష్ట్రానికి తెచ్చింది గుండుసున్నా దాని గురించి ప్రజలు అడుగుతున్నారు. రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలె' అని నిలదీశారు. 'ఇప్పుడు ఈ చర్చను 21 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించలేకపోయినా మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే పెట్టారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేయండి. రాజ్యసభలో మా ఎంపీలు కూడా కలిసి వస్తారు' అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి