Lok Sabha Election 2024: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా గులాబీ బాస్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత బాత్రూంలో పడటంతో కేసీఆర్‌ కాలికి గాయం అయ్యింది. అనంతరం కోలుకుని ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ బయట కనిపించిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పారు. దాంతో కేసీఆర్ మళ్లీ పాలిటిక్స్‌లో ఎప్పుడెప్పుడు యాక్టివ్ అవుతారన్న ప్రశ్నలు బీఆర్‌ఎస్‌లో వ్యక్తమయ్యాయి. ఆయనన్ను క్రియాశీల రాజకీయాల్లో మళ్లీ చూడాలని కోట్లాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నాయి. అయితే త్వరలోనే గులాబీ బాస్.. పొలిటికల్ సీన్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వాటిపై కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కీలక నేతలకు ఈ దిశగా కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. కొందరు ముఖ్యనేతలను తన వద్దకే పిలిపించుకుని తదుపరి కార్యాచారణపై దృష్టి పెట్టారు. గెలుపు గుర్రాల ఎంపిక మొదలు.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. 


అటు జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గ నేతలతో పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీని కేసీఆర్ పూర్తి స్థాయిలో సమయత్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్, కడియం, పోచారం, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.


రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. ఒక్కోరోజు ఒక్కో సెగ్మెంట్ నేతలతో చర్చలు జరుపుతారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో... మధ్యలో మూడురోజుల విరామం ఇచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో జరగనున్న వరుస భేటీల్లో కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.


Also Read: ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ.. ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!


Also Read: Pawan Kalyan: ఏపీలో భారీ అవినీతి.. సీబీఐ విచారించండి.. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter