BSP Manifesto: ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు.. బీఎస్పీ దిమ్మతిరిగే హామీలు
Telangana BSP Primises: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది బీఎస్పీ. అధికారంలోకి వస్తే మహిళా కార్మికులకు, రైతులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు అందజేస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Telangana BSP Primises: తెలంగాణ ఎన్నికల హీటు పెరుగుతోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు మేనిఫెస్టోలను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. విడుతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. బీజేపీ కూడా బహిరంగ సభలతో ప్రచారం పర్వంలో ముందుంది. రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సత్తాచాటేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రెడీ అవుతోంది. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 10 పథకాలతో ఆయన మేనిఫెస్టోను ప్రకటించారు.
రాష్ట్రంలో మహిళా కార్మికులు, రైతులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళా కార్మికులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని.. వచ్చే ఐదేళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇందులో 50 శాతం ఉద్యోగాలు మహిళలకు కల్పిస్తామన్నారు. భూమిలేని ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని.. మహిళల పేరు మీద భూమి పట్టా జారీ చేస్తామని తెలిపారు.
బీఎస్పీ హామీలు ఇవే..
==> ఇళ్లు లేని వారికి 550 చదరపు గజాల ఇళ్ల స్థలాలు కేటాయింపు.. ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం రూ.6 లక్షల సాయం..
==> రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
==> విద్యార్థి నేతలకు షాడో మంత్రులుగా అవకాశం
==> అన్ని పంటలకు కనీస మద్దతు ధర (MSP), ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు సబ్సిడీ
==> కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రద్దుకు హామీ
==> ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ పాఠశాల
==> ప్రతి సంవత్సరం, ప్రతి మండలం నుంచి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య
==> గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కార్మికులకు ప్రతి సంవత్సరం 150 రోజుల పాటు కనీస రోజువారీ వేతనం రూ.350తో పాటు హామీతో కూడిన ఉపాధి.. వారికి ఉచిత రవాణా, ఆరోగ్య బీమా
==> ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా,
==> పౌష్టికాహారం, ఆరోగ్య బడ్జెట్‌పై ప్రతి సంవత్సరం రూ.25 వేల కోట్లు ఖర్చు
==> గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రూ.5,000 కోట్లతో బోర్డును ఏర్పాటు
==> ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను క్రమబద్ధీకరిస్తామని హామీ.
Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!
Also Read: TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి