building collapse in yadadri: యాదగిరిగుట్టలో ఓ భవనం కుప్పకూలింది. పురాతనమైన రెండస్థుల భవనం కూలడంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నారు. వారిని వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయకసిబ్బంది అక్కడకు చేరుకొని శిథిలాలు తొలగిస్తున్నారు. ఈ బిల్డింగ్ లో  ఇళ్లతో పాటు షాపులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాదాద్రిలో మెయిన్ రోడ్ పక్కనే ఉన్న శ్రీరాంనగర్ లో ఈ ప్రమాదం జరిగింది. భవనంలో వెనక భాగంలో నివాససముదాయాలు ఉండగా ముందు భాగంలో షాపులు నిర్వహిస్తున్నారు. నివాస సముదాయాల్లో రెండు ఫ్యామిలీలు ఉంటున్నాయి. ఘటన జరిగినప్పుడు షాపుకు వచ్చిన పలువురు గాయపడ్డారు. వారిని భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కూలిన భవనం 35 ఏళ్ల పురాతనమైందని అధికారులు తెలిపారు. 


Also read: Gang Rape: పాఠశాలలో బాలికపై సామూహిక అత్యాచారం..!!


Also read: Shani in Dream: నిద్రలో వచ్చే కలలో శనీశ్వరుడు కనిపిస్తే శుభమా? అశుభమా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.