Business Woman Shilpa Chowdary socialite picked up for multi-crore cheating : వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తానంటూ.. తనకు డబ్బు ఇస్తే అధిక వడ్డి ఇప్పిస్తానంటూ పలువురిని ఆమె మోసం చేసింది. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ ఆమె తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకొని పలువురిని రూ. కోట్లలో (multi-crore) మోసం చేసింది. పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించినట్లు వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి తిరిగి ఇవ్వలేదు. 
 
వ్యాపారవేత్తగా (Business Woman) చెప్పుకునే శిల్పా చౌదరి (Shilpa Chowdary) అనే మహిళ ఆమె భర్త శ్రీనివాస్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటికి పైగా తీసుకొని తిరిగి ఇవ్వలేదంటూ ఒక మహిళ నార్సింగి పీఎస్‌లో (Narsingi Police Station) ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో నివాసం ఉంటోన్న శిల్ప, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శిల్ప... నిజంగానే బాధితురాలి నుంచి రూ.కోటిగా పైగా నగదు తీసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు తిరిగి చెల్లించకపోవడంతో శిల్ప, ఆమె భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పేజ్‌ త్రీ పార్టీలో (page 3 parties) ప్రముఖుల పేర్లు చెప్పి అధిక వడ్డికి ఇప్పిస్తానంటూ శిల్ప వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు శిల్ప ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శిల్పా మోసం (cheating) చేసిన వారిలో పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనార్సర్లు ఉన్నారు. కిట్టి పార్టీల పేరుతో డబ్బులున్న వారితో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది శిల్ప. 


Also Read : Undavalli Arun Kumar: రెండేళ్ల జగన్ పాలన డిజాస్టర్-ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు


ఇక శిల్పా చౌదరి గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీల ఏర్పాటు చేసింది. అక్కడికి వారిని ఆహ్వానించి వారితో పరిచయం ఏర్పాటు చేసుకుని తాను సినీ ఫీల్డ్ లో (Cine field) ప్రొడ్యూసర్ ను (Producer) అంటూ మ్మబలికి వారి నుంచి కోట్ల రూపాయ తీసుకొని తప్పించుకు తిరుగుతోందనే ఆరోపణలున్నాయి. శిల్ప అరెస్ట్ తర్వాత తాము కూడా ఆమె చేతిలో మోసపోయామంటూ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు (Cine Celebrities) వరసగా పోలీసు (Police) స్టేషన్‌కు క్యూ కడుతున్నారట. 


Also Read : Trivikram : డైరెక్టర్ త్రివిక్రమ్ ట్వీట్ గురించి మంత్రి పేర్ని నానికి రిప్లై


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook