హైదరాబాద్: TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్ (Ravi Prakash)‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ED)‌ బుధవారం కేసు నమోదు చేసింది. టీవీ9 పేరెంట్ కంపెనీ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (ఏబీసీ) లిమిటెడ్‌ నుంచి 2018 సెప్టెంబర్‌ నెల నుంచి 2019 మే నెల వరకు ఏ అనుమతుల్లేకుండా రూ.18 కోట్ల నిధులను ఉపసంహరించారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు గతంలో రవిప్రకాష్‌తో పాటూ మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. GVK గ్రూప్ చైర్మన్‌పై సీబీఐ కేసు.. వందల కోట్ల చీటింగ్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 అక్టోబర్‌లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సంస్థ ఫిర్యాదు, కేసు నమోదు ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ECIR) నమోదు చేసింది. ఈడీ వరకు వెళ్లిందంటే త్వరలోనే రవి ప్రకాష్‌ను ఈ కేసులో సమన్లు ఇచ్చి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos


రవి ప్రకాష్‌ను 2019 అక్టోబర్‌లో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కొద్దిరోజులకు బెయిల్ రావడంతో రవి ప్రకాష్‌ విడుదలయ్యారు. 2018లో అలంద మీడియా టీవీ9లో మెజార్టీ షేర్ల కొనుగోలుతో ఈ స్కాం బయటపడినట్లు ఆ సంస్థ చెప్పింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!