Hydra On Musi: కమిషనర్ రంగనాథ్‌పై కేసు నమోదు.. హైడ్రా అంటే బూచీ కాదు భరోసా అంటున్న ఎండీ దాన కిషోర్..
Hydra On Musi Residents Relocation: మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్ నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసిన తప్ప నిరుపేదల ఇళ్లను కాదని చెప్పారు.
Hydra On Musi Residents Relocation: మూసి బఫర్ జోన్ లో నివసిస్తున్న వారిని బలవంతంగా తరలించలేదని, వారు ఇష్టప్రకారమే వెళ్తున్నారని ఎండి దానికిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బఫర్ జోన్ లో నివసిస్తున్న వారిని తరలిస్తున్నామని చెప్పారు. మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్ నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసిన తప్ప నిరుపేదల ఇళ్లను కాదని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా హైడ్రా పైవస్తున్న తీవ్ర నిరసనలు వ్యతిరేకలను ఆయన దుష్ప్రచారం చేయవద్దని చెప్పారు.
సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి చాలా భావోద్వేగానికి గురవుతారు. అటువంటి వారికి సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ లు కూడా ఇప్పిస్తున్నామన్నారు. అయితే నిబంధనల ప్రకారం సొంతభవనాలు కలిగిన వారికి చెల్లింపులు చేస్తామని చెప్పారు. మూసి నిర్వాసితులను కన్నబిడ్డల్లా చూసుకుంటాం, వారికి అండదండగా ఉంటాం. కానీ హైడ్రా అంటేనే బూచీ అన్నట్టుగా సామాజిక మాధ్యమంలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని దానికిషోర్ చెప్పారు.
ముఖ్యంగా మూసి నిర్వసితులకి రూ.30 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తున్నామని అంతేకాదు అదనంగా ఇల్లు నిర్మించడానికి కూడా రూ.700 కోట్ల వరకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది అన్నారు. మూసి నిర్వాసితులకు ఉపాధి వారి పిల్లల చదువుల అంశాలను పరిగణలోకి తీసుకున్నాం. పట్టా భూములకు చట్ట ప్రకారం చెల్లింపులు చేస్తాం. మరో రెండు నెలల్లో మూసి అభివృద్ధి పనులు చేపడుతాం టెండర్లను కూడా ఆహ్వానిస్తామని దానికిషోర్ అన్నారు.
ముఖ్యంగా మూసి అభివృద్ధికి పదివేల కోట్లు 10000 కోట్లు మంజూరు చేశారని అన్నారు. మూసిని పర్యాటక కేంద్రంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్షాళన చేపట్టారని పేర్కొన్నారు. ఈ మూసి నది అభివృద్ధితో నగరం రూపురేఖలే మారిపోతాయి అని పేదల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయన్నారు.ఇక ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మున్సిపాలిటీలో నిర్మాణ అనుమతుల మంజూరుకు తీసుకురానున్నట్లు దానాకిషోర్ చెప్పారు. ముఖ్యంగా విద్యావంతులు కూడా ఎఫ్.టి.ఎల్. బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు దుర్గం చెరువులో కొంత సం సందిగ్ధత ఉందన్నారు.
అయితే సంబంధించిన అన్ని మ్యాప్లను జిహెచ్ఎంసి, హైడ్రా, హెచ్ఎండిఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచానున్నారు, యాప్ ద్వారా వివరాలన్నీ ప్రజల ముందు పెట్టనున్నారు. దీంతో ఎఫ్డిఎల్ బఫర్ జోన్ వివరాలు ప్రజలు ఈజీగా తెలుసుకునే అవకాశం ఉందని దానికిషోర్ అన్నారు.
ఇదీ చదవండి: మహిళ ఆత్మహత్యకు.. హైడ్రాకు సంబంధం లేదు.. దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ ఫైర్..
ఇదీ చదవండి: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..
ఇదిలా ఉండగా బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యను హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య నాకు బాధాకరంగా అనిపించింది అన్నారు. తప్పుడు ప్రచారంతో భయాందోళన చెంది ఆత్మహత్యకు గురై పాల్పడ్డారని పేర్కొన్నారు .సున్నం చెరువులో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారని ఆయన ట్యాంకర్ల వ్యాపారంతో రోజుకు లక్ష సంపాదిస్తున్నాడు, పేదలను అడ్డుగా పెట్టుకుని స్వప్రయోజనాల కోసం అలా చేస్తున్నారని హైడ్రా కమిషనర్ చెప్పారు .
ఇది ఇలా ఉండగా హైడ్రా తన ఇల్లు కులుస్తుందని బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే ఆమె కుటుంబం ఎన్ హెచ్ ఆర్ సి ని ఆశ్రయించగా రంగనాథ్ పై 16063/IN/224 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడైంది.అయితే మున్సిపాలిటీ పంచాయతీ నుంచి పక్కకు అనుమతులు పొందిన భవనాలను కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. విద్యా సంవత్సరం ముగిశాక కాలేజీలపై కూడా చర్యలు ఉంటాయని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.