CBI Notice To Kavitha: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం ఎదురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గుర్తించింది. ఈ సందర్భంగా కవితకు సీబీఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంతో కవిత అరెస్ట్‌ అవుతారనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు కవిత కూడా అరెస్ట్‌ కానున్నారని జాతీయస్థాయిలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణలో భవిష్యత్‌ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Leopard Killed: ఇంట్లోకి దూరిన పులి.. కర్కశత్వంతో బూట్లతో తన్ని చంపేసిన అధికారులు


ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవితను సీబీఐ ఇప్పటికే మూడుసార్లు విచారణ చేసింది. 2022లోనూ ఇదే కేసులు ప్రశ్నించింది. తాజాగా ఈ కేసులో నిందితురాలిగా చేరుస్తూ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేయడం గమనార్హం. గతంలో ఇచ్చిన నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి నోటీసులిచ్చింది. దర్యాప్తు కవితను నిందితురాలిగా సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసులో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం కవితపై తాజాగా అభియోగాలు మోపారు.

గతంలో కవిత ఇదే విషయమై ప్రశ్నించారు. నిందితురాలిగా చేర్చకుండానే మూడుసార్లు ప్రశ్నించారని కవితతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చెప్పారు. కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తాను నిందితురాలు కాదని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు తాజాగా నిందితురాలిగా చేర్చడంతో ఇక ఈ కేసులో సీబీఐ దూకుడుగా ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

Also Read: Inter Hall Tickets: ఏపీ ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇలా..


ఇక ఇదే కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా వరుసగా నోటీసులు పంపిస్తోంది. కానీ కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకావడం లేదు. త్వరలోనే హేమంత్‌ సోరెన్‌ మాదిరి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. తాజాగా ఆప్‌ నేతలు ఇదే విషయాన్ని తెలిపారు. త్వరలోనే తమ పార్టీ అధినేత అరెస్టవుతారని ఆప్‌ వర్గాలు ప్రకటించాయి. కేజ్రీవాల్‌తోపాటే కవిత అరెస్ట్‌ కూడా ఉంటుందని తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారో చూడాలి. విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి