ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించింది. ఆమె స్వగృహంలో దాదాపు 7 గంటల విచారణ చేసింది. అనంతరం సీబీఐ అధికారులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6వ తేదీన విచారణకు ఆమెకు నచ్చిన చోటు హాజరుకావల్సి ఉండగా..వ్యక్తిగత పనుల కారణంగా అందుబాటులో ఉండనని..ఈనెల 12, 14, 15 తేదీల్లో హాజరవుతానని కవిత సీబీఐకు లేఖ రాశారు. ఆమె అభ్యర్ధన మేరకు ఇవాళ అంటే డిసెంబర్ 11వ తేదీన సీబీఐ కవిత ఇంట్లోనే ఆమెను విచారించింది. 


మొత్తం 11 మంది సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో కవిత ఇంటికి చేరుకున్నారు. అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు దాదాపు 7 గంటల సేపు ప్రశ్నించి..వివరాలు నమోదు చేసుకున్నారు. ఈరోజుతో విచారణ ముగిసిందని..మళ్లీ ఎప్పుడైనా అవసరమనుకుంటే విచారిస్తామని సీబీఐ తెలిపింది. కవిత నుంచి అవసరమైన సమాచారం సేకరించామని సీబీఐ స్పష్టం చేసింది. 


సీబీఐ విచారణ పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేసి..బయటివారిని లోపలకు రానివ్వలేదు. సీబీఐ విచారణ అనంతరం కవిత..ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా దాదాపు 45 నిమిషాలు సమావేశమయ్యారు. అటు సీబీఐ విచారణ ఇటు ముఖ్యమంత్రితో సమావేశం వివరాల్ని కవిత వెల్లడించలేదు. 


Also read: Mlc Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ టీమ్.. సర్వత్రా ఉత్కంఠ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook