Ias and ips allocation: తెలంగాణ, ఏపీ విభజన చట్టం ప్రకారం.. రెండు తెలుగు స్టేట్స్ లకు ఐఏఎస్ లు, ఐపీఎస్ లను కేటాయించారు. ఈ నేపథ్యంలో.. గతంలో వాకాడి కరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలీ, వాణి ప్రసాద్, మల్లెల ప్రశాంతితో పాటు, అంజనీ కుమార్, అభిషేక్ మహంతి ఏపీ కెడర్ అధికారులు తమకు తెలంగాణ కేడర్ కేటాయించాలని అభ్యర్థించారు. అయితే.. వీరి వాదనను కేంద్రం వ్యతిరేకించింది. అయితే.. దీనిపై సదరు అధికారులు మాత్రం క్యాట్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ అధికారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. దీనిపై తెలంగాణ సర్కారు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  దీనిపై గతంలోనే విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్రం ఉత్తర్వులను పాటించాలని స్పష్టం చేసింది.అదే విధంగా ఈనెల 16 లోగా ఏపీ సర్కారుకు రిపోర్టు చేసుకొవాలని ఆదేశించింది. ఈక్రమంలో.. హైకోర్టు తాజాగా,  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దీపక్ ను నియమించి ఆయన నివేదిక ఆధారంగా తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 11 మంది వరకు అధికారులు ఏపీలో వెళ్లి రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కసారిగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ ఫర్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలీ కాట కొన్ని నెలల క్రితమే పూర్తిగా స్థాయి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడిప్పుడు పరిపాలన గాడిలో పెడుతున్నట్లు తెలుస్తోంది.


Read more: KTR Vs Konda Surekha: కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..


ఈ క్రమంలో ఒక్కసారిగా మళ్లీ ట్రాన్స్ ఫర్స్ ఘటన వెలుగులోకి రావడంతో అధికారుల్లో కూడా, రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ మేరకు ఆయా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం పంపించినట్లు తెలుస్తోంది.  ఇప్పుడిప్పుడు పరిపాలన గాడిన పడుతున్న క్రమంలో పలువురు ఐపీఎస్, ఐపీఎస్ లు ఏపీకి వెళ్లాలని  ఆదేశాలు రావడం మాత్రం.. రేవంత్ సర్కారుకు బిగ్ షాక్ అని కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి