తెలంగాణ సీఎం కేసీఆర్ భారత ప్రధానిని ' మోడీ గాడు' అని సంబోధించిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ -బీజేపీ మధ్య చిచ్చురేగుతోంది.ఈ క్రమంలో  సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను రక్షణ మంత్రి నిర్మల సీతారామన్  తప్పుపట్టారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ప్రధాని స్థాయి వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకవచనంతో సంబోధిస్తున్నారు.. రాజ్యాంగపరంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ప్రధాన మంత్రిని ఏకవచనంతో విమర్శించడం తగదన్నారు . ఇది ఏ మాత్రం మంచి సాంప్రదాయంకాదని హితవుపలికారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖబర్దార్ కేసీఆర్...


ఈ సందర్భంగా రక్షణ మంత్రి నిర్మల మాట్లాడుతూ పార్టీల మధ్య సిద్ధాంతపరంగా వైరుధ్యాలుంటే.. దానిపై విమర్శలు చేస్తే ఓపికతో వింటాం.. అంతే కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకపోతే దానికి ధీటుగా బదులిస్తామంటూ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో హెలికాప్టర్‌ బాడీ తయారీ యూనిట్‌ ప్రారంభోత్సవానికి హాజరైన రక్షణ మంత్రి నిర్మల సీతారామన్.. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యలయంతో మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ సీఎంపై ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారు..